SBI Home Loan: శుభవార్త.. గృహ రుణాల్లో భారీ మార్పుకు ఎస్‌బీఐ శ్రీకారం.. లాభాలివే..
SBI Home Loan: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంది గృహ రుణాలు పొందుతుంటారు. అయితే కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని కల్పించేందుకు కొత్త లోన్ స్కీమ్ తో ముందుకొస్తోంది.
మీరు స్టేట్ బ్యాంక్ కస్టమర్ అయితే తప్పకుండా ఈ వార్త మీకోసమే. బ్యాంక్ గ్రీన్ ఫండింగ్ కింద ఇచ్చే గృహ రుణాల్లో పెద్ద మార్పు చేయాలని ప్లాన్ చేస్తోంది. దీని కింద హౌసింగ్ ప్రాజెక్ట్‌ల్లో రూఫ్‌టాప్ సోలార్‌ను తప్పనిసరి చేసే యోచనలో ఉంది. సులభంగా చెప్పుకోవాలంటే ఇకపై రియల్ ఎస్టేట్ బిల్డర్లు నిర్మించే ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా రూఫ్ టాప్ సోలార్ యూనిట్ తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఇది దేశంలో రానున్న కాలంలో కలిగే విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంతో పాటు వినియోగదారులకు ఖర్చులు ఆదా చేయటంలో దోహదపడుతుందని తెలుస్తోంది.

కస్టమర్లు గ్రీన్ ఫండింగ్ కింద గృహ రుణం తీసుకున్నట్లయితే సోలార్ ప్యానెల్స్ ధర కూడా దాని పరిధిలోకి వస్తుంది. జూన్‌లో బ్యాంక్ దాదాపు రూ.6.3 లక్షల కోట్ల విలువైన గృహ రుణాలను కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్.. ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, జర్మనీకి చెందిన KfWలకు దాదాపు 2.3 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రుణాలను చెల్లించాల్సి ఉంది.
బిల్డర్లు ఇకపై నిర్మిస్తున్న గృహ కట్టడాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను అమర్చడాన్ని తప్పనిసరి చేయాలని తాము భావిస్తున్నట్లు ఎస్‌బీఐ అధికారి అశ్విని కుమార్ తివారీ అన్నారు. రానున్న కాలంలో హోమ్ లోన్ దరఖాస్తుదారుల కోసం ఒక బండిల్ డీల్‌లో చేర్చే ప్లాన్ పై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ తరహా రుణాలు 10 లేదా 20 ఏళ్ల కాలపరిమితి కోసం సిద్ధం చేస్తున్నట్లు SIDBI నిర్వహించిన గ్లోబల్ SME సమ్మిట్‌లో పేర్కొన్నారు.
బ్యాంక్ గ్రీన్ ఫండింగ్ ప్రణాళిక కింద గ్రీన్ బిల్డింగ్స్, బ్యాటరీ రీసైక్లింగ్, సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్స్, బయో టాయిలెట్ల నిర్మాణం మెుదలైన కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే 'సోలార్ రూఫ్‌టాప్' నిధులను ప్రపంచ బ్యాంకు 2016లో ప్రారంభించింది. వినియోగదారులకు రుణాలు ఇవ్వడం ద్వారా క్లీన్ క్లైమేట్ క్యాంపెయిన్‌తో అనుసంధానం చేయడం దీని లక్ష్యంగా ఉంది.


Click it and Unblock the Notifications