For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: మీ పిల్లలను ధనవంతులు చేసే మ్యూచువల్ ఫండ్.. ఫుల్ డిటైల్స్..

|

Mutual Funds: ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారు చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచే పెట్టుబడులను పెడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది మంచి రాబడులను అందించే మ్యూచువల్ ఫండ్స్ కోసం వెతుకున్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి SBI మ్యూచువల్ ఫండ్ మంచి ఆప్షన్ గా మారింది. SBI మ్యూచువల్ ఫండ్ ఈ ప్లాన్‌ను 29 సెప్టెంబర్ 2020న ప్రారంభించింది. ఈ స్కీమ్ పేరు SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్. మూడేళ్ల కిందట ప్రారంభమైన ఈ స్కీమ్ మంచి రాబడులను అందించింది.

SBI Magnum Childrens Benefit Fund giving better returns, Know details

ఇన్వెస్టర్ల డబ్బు రెండింతలైంది. అప్పట్లో రూ.10గా ఉన్న స్కీమ్ ఎన్ఏవీ ప్రస్తుతం రూ.24.48గా ఉంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద మెుత్తం రూ.851 కోట్ల నిధులు పెట్టుబడులుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ సెప్టెంబర్ 29, 2020న రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ రూ.2.44 లక్షలుగా మారింది. ఈ క్రమంలో ఫండ్ దాదాపు 145 శాతం రాబడిని అందించింది. ఇదే కేటగిరీలోని ఇతర ఫండ్స్ కంటే కంపెనీ గడచిన ఏడాది కాలంలో మెరుగైన పనితీరును కనబరిచింది.

రెండేళ్ల కాలంలో ఈ కేటగిరీలో ఇతర ఫండ్స్ 10.30 శాతం రాబడిని అందించగా.. SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ ఫండ్ మాత్రం 26.97 శాతం రాబడిని ఇచ్చింది. రూ.10 వేల చొప్పున ఎస్ఐపీ రూపంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ 23 శాతం రాబడితో మెుత్తాన్ని రూ.4.26 లక్షలు చేసింది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రాబడులను పొందవచ్చని బీపీఎన్ ఫిన్‌క్యాప్ డైరెక్టర్ ఎకె నిగమ్ తెలిపారు. పిల్లల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి వారి భవిష్యత్తును చక్కదిద్దడానికి చాలా మంచిదని ఆయన పేర్కొన్నారు.

Read more about: mutual funds investment
English summary

Investment: మీ పిల్లలను ధనవంతులు చేసే మ్యూచువల్ ఫండ్.. ఫుల్ డిటైల్స్.. | SBI Magnum Children's Benefit Fund giving better returns, Know details

SBI Magnum Children's Benefit Fund giving better returns, Know details
Story first published: Thursday, May 11, 2023, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X