ఎస్బీఐ ఖాతాదారులకు మరో శుభవార్త, ఈ టోల్ ఫ్రీ నెంబర్‌తో మరిన్ని సేవలు
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంలో భాగంగా తాజాగా 18001234 అనే కాంట్రాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఖాతాదారులు ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే, ఇంటి వద్ద నుండి వివిధ రకాల ఆర్థిక సేవలను తేలికగా పొందవచ్చు. దీంతో రోజువారీ ప్రాథమిక కార్యకలాపాల కోసం ఎస్బీఐ ఖాతాదారులు తమ బ్యాంకు శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సమయం ఆదా అవుతుంది.
తాజాగా తీసుకు వచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 1234తో పాటు 1800 11 2211, 1800 425 3800, 1800 2100, 080 26599990 అనే టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేసి, ఖాతాదారులు తమకు అవసరమైన సేవలను పొందవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు దేశంలోని మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ల నుండి ఫోన్ చేసి బ్యాంకింగ్ సేవలు పొందడంతో పాటు ఖాతాదారులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

ఒకవేళ మీ ఏటీఎం కార్డు పోయినా లేదా దెబ్బతిన్నా దానిని బ్లాక్ చేసి, కొత్త డెబిట్ కార్డు జారీ చేయమని ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, ఫిర్యాదు చేయవచ్చు. కొత్త ఏటీఎం కార్డు డిస్పాచ్ స్టేటస్, చెక్ బుక్ డిస్పాచ్ స్టేటస్, టీడీఎస్ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ సేవలను 24X7 పొందవచ్చు. వివిధ డిపాజిట్, లోన్ స్కీమ్స్, సేవల సమాచారం తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications