Banking News: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతోంది. కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూ, వృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఆయా కేటగిరీల ఆధారంగా వారి అవసరాలను గుర్తించి తగిన స్కీమ్స్ రూపొందించడంలో SBIకి మంచి పేరుంది. తాజాగా అలాంటిదే ఓ పథకాన్ని లాంచ్ చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ప్రకటించింది.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై స్టేట్ బ్యాంక్ దృష్టి సారించినట్లు సంస్థ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా తెలిపారు. ఇందుకోసం 'డిజిటల్ బిజినెస్ లోన్స్' పథకాన్ని లాంచ్ చేశామన్నారు. దీని ద్వారా ఈ విభాగానికి విరివిగా రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేవలం 10 సెకండ్లలోనే ఆయా కంపెనీల లోన్ అర్హతను నిర్ణయించే విధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం 45 నిమిషాల్లో రుణం మంజూరు చేయనున్నట్లు వివరించారు.

మార్కెట్లో పరిస్థితిని బట్టి MSMEలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. కొన్ని చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయడం లేదు. ఈ జాబితాలోకి ఇప్పుడు SBI కూడా వచ్చి చేరింది. అయితే GST, IT రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారంగానే రుణ పరిమితి నిర్ణయిస్తామని SBI స్పష్టం చేసింది.
ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాది కంటే 20 శాతానికి పైగా అంటే 4 లక్షల కోట్ల మేర రుణాలను MSMEలకు SBI మంజూరు చేసింది. ఈసారి ఈ సంఖ్యను మరింత పెంచాలని చూస్తోంది. తమ రుణ పోర్ట్‌ఫోలియో అభివృద్ధికి, సంస్థ లాభాలకు ఈ విభాగం కీలకమైనదిగా భావిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ వెల్లడించారు.
ఒకపక్క రుణాలు ఇస్తూనే మరోపక్క నిధుల సమీకరణకు స్టేట్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది. మార్కెట్లోకి డెట్ బాండ్స్ రిలీజ్ చేయడం ద్వారా దాదాపు 25 వేల కోట్లను సమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. పలు విడుతలగా ఈ వ్యవహారాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. కాగా మరో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ కూడా SBI బాటలోనే నడుస్తోంది. కాకపోతే ఈక్విటీ షేర్స్ ద్వారా 10 వేల కోట్లలో సింహ భాగాన్ని సమీకరించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications