For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 గంటలకు పైగా నిలిచిన SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు

|

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. ఆదివారం అంటే జూలై 4వ తేదీన ఉదయం గం.3.25 నుండి ఉదయం గం.5.50 వరకు మొత్తం గం.2.25 నిమిషాలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయని కస్టమర్లకు సూచన చేసింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు అందుబాటులో లేవు.

ఎస్బీఐ అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన బ్యాంకు. భారత దేశంలో 22,000 బ్రాంచీలు, 57,889 ఏటీఎం సెంటర్లు కలిగి ఉంది. డిసెంబర్ 31, 2020 నాటికి 85 మిలియన్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. 19 మిలియనన్ల మంది మొబైల్ బ్యాంకింగ్ వినియోగించే వారు ఉన్నారు.

SBI internet banking services to remain unavailable today

ఎస్బీఐ జూలై ఒకటి నుండి కొత్త నిబందనలను అమల్లోకి తీసుకు వచ్చినట్లు ప్రకటించింది. ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ, బ్రాంచీ నుండి నగదు ఉపసంహరణ, చెక్కుబుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) ఖాతాదారులకు వర్తిస్తాయి.

English summary

2 గంటలకు పైగా నిలిచిన SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు | SBI internet banking services to remain unavailable today

SBI internet banking services will not be available 0n 4 July for 2 hours and 25 minutes due to maintenance activities that will be undertaken by the bank.
Story first published: Sunday, July 4, 2021, 8:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X