ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కరోనా మహమ్మారి నేపథ్యంలో తమ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ నుండి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బీమా పథకం ఉంటుంది. ఇందులో కొవిడ్ 19 చికిత్సను కూడా చేర్చింది. రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఉన్న మెడికల్ ఇన్సురెన్స్ స్కీమ్‌లో కరోనా చికిత్సను చేర్చింది. ఈ స్కీం ప్రయోజనాల కింద క్రానిక్ ఒబెస్ట్రుక్టీవ్ పల్మనరీ డిసీజెస్ లేదా ఉబ్బసం సహా మరో నాలుగు వ్యాధులతో బాధపడే వారు ఆసుపత్రిలో చేరేందుకు అనుమతించింది. ఈ మేరకు ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు సమాచారం అందించింది.

20 నుండి 25కు పెరిగిన వ్యాధుల సంఖ్య
ప్రస్తుతం ఉన్న పథకాన్ని సమీక్షించి ఎస్బీఐ ఆసుపత్రిలో ఉన్న వ్యాధుల జాబితాలో కోవిడ్ 19ను అంటువ్యాధిగా చేర్చాలని నిర్ణయించినట్లు బ్యాంకు తెలిపింది. వ్యాధుల సంఖ్య 20 నుండి 25 వరకు పెరిగిందని పేర్కొంది. ఇంట్లో కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ పథకంలో సభ్యులకు హోమ్ చికిత్స కోసం రూ.25,000 వరకు ఖర్చును అనుమతించాలని నిర్ణయించింది. ఎస్బీఐ ఈ నిర్ణయంతో రిటైరైన ఉద్యోగులకు భారీ ఊరట కలుగుతుంది. ఎస్బీఐ ప్రస్తుత ఉద్యోగులు ఇప్పటికే కోవిడ్ 19 చికిత్స కవరేజ్ పరిధిలో ఉన్నారు.

అదనంగా బీమా కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు
ఎస్బీఐ తాజా నిర్ణయంతో కోవిడ్-19 కోసం అదనంగా మరో బీమాను కొనుగోలు చేయనవసరం లేదని తెలిపింది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇది రిటైర్డ్ ఉద్యోగులకు ఉపకరిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగుల్లో ఎక్కువమంది సీనియర్ సిటిజన్లు ఉంటారు. వారికి బీమా కొనుగోలు ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది ఉపసమనమే.

ఇటీవల ప్రకటన
'ప్రస్తుత పథకాన్ని సమీక్షించాం. ఎస్బీఐ హెల్త్ కేర్ స్కీంలో వ్యాధుల జాబితాలో కోవిడ్-19ను చేర్చాలని నిర్ణయించాం' అని బ్యాంకు రెండు రోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, కరోనా కారణంగా అందరి కోసం కొత్తగా కరోనా కవచ్, కరోనా రక్షక్ స్కీంలను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications