లోన్ తీసుకునే వారికి ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. వరుసగా తొమ్మిదోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 7.90 పాయింట్లుగా ఉన్న ఎంసీఎల్ఆర్ 7.85 పాయింట్లకు చేరుకుంది. తగ్గించిన ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

హోమ్, వెహికిల్ లోన్లు మరింత చౌక
వడ్డీ రేట్లు 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో హోమ్ లోన్, వెహికిల్ లోన్స్ ఇక మరింత చౌకగా లభించనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి MCLR 7.85 శాతంగా ఉంటుందని ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది.

టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గింపు
టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీ రేట్లను కూడా తగ్గించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ తగ్గింపు 10 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది. ఇది కూడా ఫిబ్రవరి 10వ తేదీ నుండే అమల్లోకి వస్తుంది.

బల్క్ ఎఫ్‌డీలపై కూడా
బల్క్ ఎఫ్‌డీ రేట్లు 25 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాలని నిర్ణయించింది. ఇదీ ఫిబ్రవరి 10వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. రూ.2 కోట్లకు పైగా డిపాజిట్లను బల్క్ ఎఫ్‌డీలుగా చెబుతారు. ఈ నిర్ణయంతో రుణాలు తీసుకునే వారికి శుభవార్త. డిపాజిట్ చేసే వారికి చేదు.

పెరిగిన రుణాలు
క్రెడిట్ గ్రోత్ పెంచేందుకు ఎస్బీఐ చర్యలు తీసుకుంటోంది. కాగా, ఎస్బీఐ రుణాలు 6.8 శాతం మేర పెరిగాయని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్‌తో ముగిసే సంవత్సరానికి రూ.23,01,669 కోట్లకు చేరినట్లు తెలిపింది. పర్సనల్ లోన్స్ 17.49 శాతం పెరిగినట్లు పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications