ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచింది. కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్ల పాటు వడ్డీ రేట్లు దశాబ్దంన్నర కనిష్టం వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక రికవరీ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ రెపో రేటును గత నెలలో 40 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ ద్వైపాక్షిక సమావేశంలో మరోసారి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా పర్సనల్ లోన్ నుండి వెహికిల్ లోన్, హోమ్ లోన్ వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
ఇందులో భాగంగా ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు(EBLR) హోమ్ లోన్ వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈబీఎల్ఆర్ ఆధారిత ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65 శాతం నుండి 7.05 శాతానికి, రెపో ఆధారిత హోమ్ లోన్ వడ్డీ రేటు 6.25 శాతం నుండి 6.65 శాతానికి చేరుకుంది. క్రెడిట్ రిస్క్ ప్రీమియం దీనికి అదనం. బుధవారం నుండి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది.

జూన్ 1వ తేదీ నుండి ఈబీఆర్ హోమ్ లోన్ వడ్డీ రేటు 7.05 శాతం, ఈబీఎల్ఆర్ వడ్డీ రేటు 7.05 శాతం (ప్లస్ సీఆర్బీ)కి పెరిగింది. ఆర్ఎల్ఎల్ఆర్ వడ్డీ రేటు 6.65 శాతం ప్లస్ సీఆర్బీ. అంతకుముందు ఎస్బీఐ ఈబీఎల్ఆర్ వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. ఇది 40 బేసిస్ పాయింట్లు పెరిగింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications