కరోనా మహమ్మారి కారణంగా గత ఆరునెలలుగా అన్ని రంగాల్లోను డిమాండ్ క్షీణించింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐతో పాటు ఇటీవల యాక్సిస్ బ్యాంకు కూడా కస్టమర్లకు హోమ్ లోన్, కారు లోన్, టూవీలర్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్లపై మంచి ఆఫర్లు ప్రకటించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రద్దు లేదా కొంత శాతాన్ని రద్దు చేశాయి. ఎస్బీఐ తాజాగా కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.

హోంలోన్ పైన అదిరిపోయే ఆఫర్
హోమ్ లోన్ కస్టమర్లకు SBI అదిరిపోయే పండుగ ఆఫర్ ప్రకటించింది. హోమ్ లోన్ వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ కల్పించనున్నట్లు బుధవారం ప్రకటించింది. కస్టమర్ సిబిల్ స్కోర్ ఆధారంగా వారికి వడ్డీ పైన 25 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఉంటుందని తెలిపింది.
కస్టమర్ క్రెడిట్ ఆధారంగా రూ.75 లక్షలకు పైగా రుణాలు తీసుకునే వారికి 20 బేసిస్ పాయింట్ల వరకు రాయితీ ఇస్తున్నామని, యోనో యాప్ ద్వారా ఈ రుణానికి ఆమోదం లభిస్తే మిగతా 5 శాతం ఇస్తామని తెలిపింది.
మహిళల పేరుపై హోమ్ లోన్ తీసుకుంటే మరో 5శాతం కన్సెషన్ ఉంటుందని తెలిపింది.

రూ.30 లక్షల హోమ్ లోన్ పైన..
ఫెస్టివ్ ఆఫర్లలో భాగంగా రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు హోమ్ లోన్ల పై కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ఆధారంగా 20 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు ఎస్బీఐ ఇదివరకు ప్రకటించింది. ఈ రాయితీని ఎనిమిది మెట్రో సిటీల్లో రూ.3 కోట్ల లోపు గృహ రుణాలపై అందచేస్తామని తెలిపింది. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. బ్యాంకు ప్రస్తుతం రూ.30 లక్షలలోపు విలువ కలిగిన హోమ్ లోన్స్ పైన 6.9 శాతం నుంచి వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. రూ.30 లక్షలకు పైబడిన హోమ్ లోన్స్ పైన 7 శాతంగా ఉంది.

గత నెలలోనే బంపరాఫర్
కాగా, SBI తన కస్టమర్లకు ఇటీవల బంపరాఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసింది. పండుగ సీజన్‌లో రుణాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎస్బీఐ యోనో యాప్ దరఖాస్తు చేసే కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసిన విషయం తెలిసిందే. రుణాలు తీసుకునే వారికి ఇది గుడ్‌న్యూస్. యోనో ద్వారా వెహికిల్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే వారికి 100% ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్రూవ్డ్ ప్రాజెక్టుల్లో హోమ్ లోన్ పైన కూడా 100శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే హోమ్ లోన్ పైన క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం ఆధారంగా 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీలో రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications