For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 లక్షల కోట్లు దాటిన ఎస్‌బీఐ హోమ్‌లోన్ బిజినెస్.. పదేళ్లలో ఐదు రేట్లు ఎక్కువగా..

|

హోమ్‌‌ లోన్ బిజినెస్‌‌ రూ. 5 లక్షల కోట్ల మార్క్ దాటిందని స్టేట్‌‌ బ్యాంక్ ఆఫ్‌‌ ఇండియా తెలిపింది. గత పదేళ్లలో రియల్‌‌ ఎస్టేట్‌‌ అండ్ హౌసింగ్‌‌ బిజినెస్‌‌ ఐదు రెట్లు పెరిగిందని తెలిపింది. 2011లో ఎస్‌‌బీఐ అసెట్‌‌ అండర్‌‌‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ రూ. 89 వేల కోట్లుగా ఉండగా, 2021 నాటికి రూ. ఐదు లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంక్‌‌పై కస్టమర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఎస్‌‌బీఐ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పర్సనలైజ్డ్‌‌ సర్వీస్‌‌లను టెక్నాలజీతో కంబైన్ చేయడం అవసరమని ఎస్‌‌బీఐ చైర్మన్‌‌ దినేష్‌‌ ఖారా అభిప్రాయపడ్డారు. హోమ్‌‌ లోన్ డెలివరీని మెరుగుపరిచేందుకు ఎస్‌‌బీఐ పనిచేస్తుందని తెలిపారు. ఇందుకోసం యునిక్ ఇంటిగ్రేటెడ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ రిటైల్‌‌ లోన్ మేనేజ్‌‌మెంట్‌‌ సిస్టమ్‌ను బ్యాంక్‌‌ డెవలప్ చేస్తోందని చెప్పారు. ఇది కస్టమర్లకు ఎండ్‌‌ టూ ఎండ్‌‌ డిజిటల్ సొల్యూషన్స్‌‌ను అందిస్తుంది.

sbi home loan business exceeds rs 5 lakh crores

2024 ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంక్ హోమ్‌‌ లోన్ బిజినెస్‌‌ సైజును రూ. 7 లక్షల కోట్లకు పెంచాలని ఎస్‌‌బీఐ టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇండియన్ హోమ్‌‌ లోన్ మార్కెట్‌లో బ్యాంక్ వాటా 34 శాతంగా ఉంది. 2004 లో హోమ్‌‌ లోన్‌‌ బిజినెస్‌‌లోకి ఎంటర్ అయిన స్టేట్‌‌బ్యాంక్‌‌.. బిజినెస్‌‌ను 2012లో సపరేట్ చేసింది.

English summary

5 లక్షల కోట్లు దాటిన ఎస్‌బీఐ హోమ్‌లోన్ బిజినెస్.. పదేళ్లలో ఐదు రేట్లు ఎక్కువగా.. | sbi home loan business exceeds rs 5 lakh crores

state bank of india home loan business exceeds rs 5 lakh crores.
Story first published: Saturday, February 13, 2021, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X