Cashback SBI Card: ఈ కార్డుతో ఏ సైట్ లో షాపింగ్ చేసినా 5% క్యాష్ బ్యాక్ పక్కా.. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డు..
SBI కార్డ్ గురువారం 'క్యాష్‌బ్యాక్ SBI కార్డ్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. కార్డ్ హోల్డర్‌లు ఎటువంటి వ్యాపార పరిమితులు లేకుండా అన్ని ఆన్‌లైన్ షాపింగ్ పై 5% క్యాష్‌బ్యాక్‌ను పొందే సౌకర్యం పొందుతారు.టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న వారితో సహా భారతదేశం అంతటా ఉన్న వినియోగదారులు, డిజిటల్ అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్ 'SBI కార్డ్ SPRINT' ద్వారా 'క్యాష్‌బ్యాక్ SBI కార్డ్' కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.

ఉచితం
ప్రత్యేక ఆఫర్‌గా కింద మార్చి 2023 వరకు మొదటి సంవత్సరం కాంటాక్ట్‌లెస్ కార్డ్ ఉచితం. 'క్యాష్‌బ్యాక్ SBI కార్డ్' కస్టమర్‌లు అన్ని ఖర్చులపై అపరిమిత 1% క్యాష్‌బ్యాక్ పొందుతారని పేర్కొంది. కస్టమర్ 10,000 తక్కువ కొనుగోలు చేస్తే 1 శాతం, రూ.10 వేల కంటే ఎక్కువ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుందని తెలిపింది. SBI కార్డ్ MD & CEO రామమోహన్ రావు అమర లాంచ్ సందర్భంగా మాట్లాడారు.

ప్రతిచోటా క్యాష్‌బ్యాక్
"CASHBACK SBI కార్డ్ మా కోర్ కార్డ్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. మేము ఆలోచనాత్మకంగా రూపొందించిన 'క్యాష్‌బ్యాక్ SBI కార్డ్' ప్రతి కొనుగోలుపై, ప్రతిసారీ, ప్రతిచోటా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందేందుకు వినియోగదారులను నిజంగా శక్తివంతం చేస్తుందని చెప్పారు. ఈ కార్డ్‌పై ఇంధన సర్‌ఛార్జ్‌పై 1% క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉందన్నారు.

2 లక్షలు
ఈ కార్ ఉన్న వినియోగదారులు ప్రతి సంవత్సరం రూ.2 లక్షల వరకు షాపింగ్ చేయవచ్చని ఎస్బీఐ కార్డు పేర్కొంది. ఒకవేళ మీరు ఒక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు షాపింగ్ చేస్తే, మీరు ఈ కార్డుకు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది.


Click it and Unblock the Notifications