ధన్తేరస్, దీపావళి సందర్భంగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఆఫర్లు తీసుకొచ్చింది. ఈ సీజన్‌లో ప్రజలు గృహోపకరణాల నుంచి కార్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు. వారిని ఆకర్షించడానికి బ్యాంకులు అనేక రకాల పథకాలను రూపొందిస్తూనే ఉంటాయి. అందులో భాగంగా ఎస్బీఐ ఈ పండుగ సీజన్‌లో తన కస్టమర్ల కోసం అద్భుతమైన పథకాలను ప్రారంభించింది.
ట్విట్టర్
ఈ ఆఫర్లలో కస్టమర్‌లు ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ, కారు లోన్, గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.మీ పండుగను రెట్టింపు చేసేందుకు, SBI మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చిందని బ్యాంక్ తన ట్వీట్‌లో పేర్కొంది.

ప్రాసెసింగ్ ఫీజు లేదు
పర్సనల్ లోన్, కారు లోన్, గోల్డ్ లోన్ తీసుకోవడానికి మీరు ఎలాంటి లోన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, మీరు SBI YONO యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ bank.sbiని సందర్శించవచ్చని పేర్కొంది. దీనితో పాటు, ఈ పండుగ సీజన్ కస్టమర్లకు బ్యాంక్ మీకు రుణంపై ఆకర్షణీయమైన వడ్డీ రేటును కూడా అందిస్తోందని తెలిపిం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అతిపెద్ద షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన రిలయన్స్ రిటైల్‌తో జతకట్టింది. ఈ ఒప్పందం ద్వారా SBI మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్ వినియోగదారులు రిలయన్స్ రిటైల్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుపై 10% వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందడానికి, మీరు కనీసం రూ.10,000 వరకు షాపింగ్ చేయాలి.


Click it and Unblock the Notifications