ఇండియాలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ NGOల సహకారంతో ప్రారంభించిన SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్, గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును తీసుకొచ్చే లక్ష్యంతో కొనసాగుతున్న ఫెలోషిప్ ప్రోగ్రాం. ఈ ఫెలోషిప్‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారతదేశం అంతటా అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేయడానికి, గ్రామీణ వర్గాల సంక్షేమానికి దోహదపడే అవకాశాన్ని అందిస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ అలాగే జీవనోపాధి వంటి కీలక సమస్యలను పరిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమం గ్రామీణ భారతదేశాన్ని సాధికారపరచడంలో ఇంకా యువతలో సామాజిక బాధ్యత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల స్టైఫండ్ కూడా అందిస్తున్నారు.

ముఖ్యమైన తేదీలు : SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 యువతకు 13 నెలల వేతనంతో ఇంటర్న్‌షిప్ ద్వారా గ్రామీణాభివృద్ధికి తోడ్పడటానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందుకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవుతుంది, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 మే 2025గా నిర్ణయించారు. మరోవైపు ఈ ఫెలోషిప్ కార్యక్రమం 13 నెలల పాటు కొనసాగుతుంది, అయితే ప్రస్తుతం 2025-26 బ్యాచ్ ప్రారంభం కానుంది.
అర్హతలు: SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26కి అర్హత సాధించడానికి అభ్యర్థులు ప్రమాణాలు చూస్తే :
*జాతీయత : భారతీయలు లేదా నేపాల్, భూటాన్ పౌరులు లేదా భారతదేశ ఎన్నారై (OCI) అయి ఉండాలి.
*విద్యార్హత : అక్టోబర్ 2025కి ముందు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
*వయస్సు : అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
*నివాసం : భారతదేశంలో నివాసం పొంది ఉండాలి అలాగే 13 నెలల పాటు ఫెలోషిప్‌కు ఫుల్ టైం కేటాయించాలి.
*ప్రతినెల స్టైఫండ్ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,000 స్టైఫండ్ అందిస్తుంది.
ఇంటర్న్‌షిప్ వ్యవధి: SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 13 నెలల ఇంటర్న్‌షిప్‌ను అందిస్తుంది, సెలెక్ట్ చేసిన సభ్యులకు భారతదేశం అంతటా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాన్ని ఉంటుంది.
*ప్రయోజనాలు
ప్రతినెల స్టైపెండ్ : మీ సాధారణ ఖర్చులకు నెలకు రూ.16,000.
ప్రయాణ అలవెన్సులు : రవాణా కోసం రూ.2,000 ఇంకా ప్రాజెక్ట్ సంబంధిత ఖర్చులకు రూ.1,000.
ఫుల్ స్టైపెండ్ : 13 నెలల ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత రూ.90,000.
ప్రయాణ అలవెన్సులు : ఇంటి నుండి ప్రాజెక్ట్ సైట్ చేరుకోవడానికి 3AC రైలు ఛార్జీలు.
ఇన్సూరెన్స్ : ఇంటర్న్‌షిప్ కాలానికి హెల్త్ అండ్ ప్రమాద బీమా కవరేజ్ కల్పిస్తుంది.
ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌ను www.change.youthforindia.org ఓపెన్ చేసి SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ వెబ్‌సైట్‌కు వెళ్లండి. ఇక్కడ "apply online now" పై క్లిక్ చేయండి. ఇప్పుడు దరఖాస్తు ఫామ్ నింపండి అలాగే అవసరమైన అన్ని వివరాలు ఎంటర్ చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీ ప్రొఫైల్ ఫోటో ఇంకా అవసరమైన ఏవైనా ఇతర డాకుమెంట్స్ ఉంటె అప్‌లోడ్ చేయండి. ఫామ్ నింపిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిన తర్వాత ఇమెయిల్ లేదా SMS ద్వారా కన్ఫర్మేషన్ అందుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications