సేవింగ్స్ అనేది ప్రతిఒక్కరి లైఫ్'లో చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సేవింగ్స్ మీకు డబ్బు కావాల్సినపుడు ఇంకా అత్యవసర సమయాల్లో లేదా ఏదైనా ఆర్ధిక అవసరాలు ఎదురైనప్పుడు చాల ఉపయోగపడుతుంది. మీ సేవింగ్స్ డబ్బు సేఫ్'గా లేదా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారా... చాల మంది పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు (fixed deposits) చేస్తుంటారు. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లు లాంగ్ టర్మ్ పెట్టుబడులకు మంచి రిటర్న్స్ ఇస్తాయి అది కూడా మీ ఫిక్స్డ్ మొత్తానికి వడ్డీతో సహా కలిపి. FDలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బుకు భద్రత లభించడమే కాకుండా మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంది. మీరు ఎస్బిఐ బ్యాంక్‌లో 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే మీకు మీకు రూ.29,376 వడ్డీ లభిస్తుంది. ఇది మీకు నమ్మశక్యం అనిపించకపోయినా నిజం.. అయితే ఎస్బిఐలో FD చేయడం వాళ్ళ కలిగే లాభాలు, ఉపయోగాలు ఇంకా మీకు లభించే వడ్డీ వివరాలు చూద్దాం...
ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లోనే కాకుండా పోస్ట్ ఆఫీసుల్లో కూడా పెట్టవచ్చు. అయితే మీరు ఎంచుకున్న కాలానికి మీకు బ్యాంకు ఇచ్చే వడ్డీ రేట్లు మారుతుంటాయి. సాధారణంగా ఎవరైనా FDలపై ఎక్కువ రిటర్న్స్ లేదా అధిక వడ్డీ ఆశిస్తుంటారు. అయితే SBI అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి వడ్డీ రేట్లను చూస్తే 7 రోజుల నుండి 45 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 3% శాతం వడ్డీ, 180 రోజుల నుంచి 210 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ, 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ, 2 సంవత్సరాల నుండి కానీ 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ, 400 రోజుల కాలపరిమితి ఉన్న అమృత్ కలాష్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 7.10 శాతం వడ్డీ లభిస్తుంది.

ఎస్‌బిఐ బ్యాంకుకు రూ. 5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కింలో డిపాజిట్ చేస్తే మీకు ఎంత రిటర్న్ వస్తుందంటే ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.80% వడ్డీ రేటు అంటే ఈ మొత్తం రూ.29,376 వడ్డీ లభిస్తుంది. మీరు మెచ్యూరిటీ సమయంలో మీ ఫిక్స్డ్ డిపాజిట్ 5 లక్షలు ఇంకా వడ్డీ కలిపి రూ. 5,29,376 పొందవచ్చు. 2 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లో మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 6.80 శాతం వడ్డీ రేటుతో రూ. 72,187 వడ్డీ ఆదాయం లభిస్తుంది. అంటే రెండేళ్ల తర్వాత రూ. 5 లక్షలు దీని పై మీ వడ్డీ పొందవచ్చు. SBI బ్యాంక్ 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.00% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ మొత్తం రూ. 1,15,720. మీరు మెచ్యూరిటీ సమయంలో 5 లక్షలు ఇంకా వడ్డీ కలిపి రూ. 6,15,720 పొందవచ్చు. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లో మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 6.50 శాతం వడ్డీ రేటుతో వడ్డీ మొత్తం రూ. 1,90,210 లభిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత రూ. 5 లక్షలు దీనితో పాటు వడ్డీ పొందవచ్చు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications