ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలతో పాటు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటోంది. అందుకే చాలా మంది తమ కష్టార్జితం భద్రంగా ఉంటూ, స్థిరమైన ఆదాయం రావాలని కోరుకుంటారు. అటువంటి వారికి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) ఒక అద్భుతమైన మార్గం. ముఖ్యంగా దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బుకు పూర్తి భద్రత ఉండటమే కాకుండా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు (interest rates) కూడా లభిస్తాయి.

RBI రెపో రేటు, బ్యాంక్ వడ్డీలు
సాధారణంగా బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించే రెపో రేటుపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగిన తాజా మానిటరీ పాలసీ మీటింగ్‌లో RBI రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. దీనివల్ల బ్యాంకుల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న డిపాజిట్ వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. దీనివల్ల ఇన్వెస్టర్లకు ముందే నిర్ణయించిన ఆదాయం గ్యారెంటీగా లభిస్తుంది.
SBI తాజా వడ్డీ రేట్ల వివరాలు
SBI వివిధ కాలపరిమితులకు సాధారణ ప్రజలకు , సీనియర్ సిటిజన్లకు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తోంది..
- 7 రోజుల నుండి 45 రోజులు: సాధారణ ప్రజలకు 3.05%, సీనియర్ సిటిజన్లకు 3.55% వడ్డీ లభిస్తుంది.
- 46 రోజుల నుండి 179 రోజులు: సాధారణ ప్రజలకు 4.90%, సీనియర్ సిటిజన్లకు 5.40% వడ్డీ.
- 180 రోజుల నుండి 210 రోజులు: సాధారణ ప్రజలకు 5.65%, సీనియర్ సిటిజన్లకు 6.15% వడ్డీ.
- 211 రోజుల నుండి 1 ఏడు లోపు: సాధారణ ప్రజలకు 5.90%, సీనియర్ సిటిజన్లకు 6.40% వడ్డీ.
- 1 ఏడు నుండి 2 ఏళ్ల లోపు: సాధారణ ప్రజలకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75% వడ్డీ.
- 2 ఏళ్ల నుండి 3 ఏళ్ల లోపు: సాధారణ ప్రజలకు 6.40%, సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ.
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల లోపు: సాధారణ ప్రజలకు 6.30%, సీనియర్ సిటిజన్లకు 6.80% వడ్డీ.
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు: సాధారణ ప్రజలకు 6.05%, సీనియర్ సిటిజన్లకు 7.05% వడ్డీ.
రూ.86,012 వడ్డీని ఎలా పొందాలి?
మీరు SBI లో 2.5 సంవత్సరాల కాలపరిమితితో ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీకు 6.4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. దీని పూర్తి లెక్క ఇప్పుడు చూద్దాం.
- పెట్టుబడి మొత్తం: రూ.5,00,000 (ఐదు లక్షలు)
- కాలపరిమితి: 2.5 ఏళ్లు (30 నెలలు)
- వడ్డీ రేటు: 6.4%
- లభించే మొత్తం వడ్డీ: రూ. 86,012
- మెచ్యూరిటీ మొత్తం: రూ. 5,86,012
అంటే కేవలం రెండున్నర ఏళ్లలోనే రిస్క్ లేకుండా మీరు దాదాపు 86 వేల రూపాయలకు పైగా లాభాన్ని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకైతే 6.90% వడ్డీ రేటు ఉండటం వల్ల ఈ లాభం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, తక్కువ కాలంలో మెరుగైన రిటర్న్స్ ఆశించే వారు SBI FDని ఒక మంచి ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications