కరోనా వైరస్ మహమ్మారితో అతలాకుతలం అయిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించాలంటే మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాల్సిందే. వ్యవసాయం మినహా మిగితా అన్ని రంగాలు కుదేలు అయిపోయిన సందర్భంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించాల్సిందేనని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కు చెందిన ఆర్థికవేత్తలు కూడా దీనినే బలపరుస్తున్నారు.
ప్రస్తుతం దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని భావించేందుకు ఎలాంటి విశ్వాసం కల్పించలేకపోతున్నాయి. అవి ఎటువంటి బలమైన కారణం లేకుండానే పరుగులు పెడుతున్నాయి. కాబట్టి, ఈ మార్కెట్ ర్యాలీని అతిశయోక్తి ర్యాలీగా పేర్కొనవచ్చని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. కరోనా మొదలైన తొలినాళ్లలో మార్కెట్లు పతనం అవుతూ నష్టాలను అందించాయి.
అది కూడా ఐదో వంతు వరకు నష్టపోయాయి. కానీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మన దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన వృద్ధి రేటును, అది కూడా 5% వరకు నెగటివ్ గ్రోత్ రేటు వైపు పయనిస్తున్న తరుణంలోనూ గత కొన్ని వారాల్లోనే స్టాక్ మార్కెట్లు పాత నష్టాలను పూడ్చుకుని మరీ లాభాల బాట పట్టడం కాస్త విచిత్రంగా తోస్తోంది.

అవి పెరుగుతాయి....
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ని ఆర్టికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని అంచనా వేసి ఆర్థిక ప్యాకేజీ తో పాటు అన్ని రకాల రుణాలపై తొలుత 3 నెలల మారటోరియం అమలు చేశారు. దానిని మరో 3 నెలలు పెంచి మొత్తంగా 6 నెలల మారటోరియం అందించారు. అయితే, ఈ నిర్ణయంతో సెప్టెంబర్ నుంచి బ్యాంకులకు కొత్త సమస్య తలెత్తే అవకాశం కనిపిస్తోందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
చాలా బ్యాంకులు తమ నిరర్థక ఆస్తుల (ఎన్ పీ ఏ ) పెరుగుదల ను గమనిస్తాయని వారు పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అమలు చేసిన విధానాలతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరిగిందని, అదే సమయంలో అందంగా కనిపిస్తున్న స్టాక్ మార్కెట్లు నిజమైన ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించలేవని ఆర్థిక వేత్తలు కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

వ్యవసాయం అలా పెరగాలి...
లాక్ డౌన్ విధించినప్పటికీ... వ్యవసాయం పై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందుకే పల్లెల్లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. అదృష్టవశాత్తు తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో పంటలు బాగా పండాయి కూడా. కానీ, దేశ ఆర్థిక వ్యవస్థలో కేవలం 20% కంటే తక్కువ వాటా కలిగిన వ్యవసాయ రంగం మొత్తం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేదు. ఒక వేల అలా జరగాలంటే మాత్రం 1951-52 ఆర్థిక సంవత్సరంలో నమోదైనట్లు వ్యవసాయం ఏకంగా 15.6% వృద్ధి రేటును నమోదు చేయాలనీ ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అప్పుడు స్థూలంగా దేశ జీడీపీ సుమారు 2% పెరిగే ఛాన్స్ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

అందుకే రెండో ప్యాకేజీ...
దేశంలో వినియోగ దారుల కొనుగోలు సరళి బాగా దెబ్బతింది. ప్రజలు నిత్యావసరాలు తప్ప లగ్జరీ వస్తువుల కొనుగోలు జోలికి వెళ్ళటం లేదు. దీంతో క్రెడిట్, డెబిట్ కార్డుల సగటు వినియోగం కూడా భారీగా పతనమైంది. కరోనా కు ముందు ఒక క్రెడిట్ కార్డు ఒక లావాదేవీ సగటు విలువ రూ 12,000 గా ఉండేది. కానీ, ప్రస్తుతం అది రూ 3,600 కు పడిపోయింది. అలాగే గతంలో ఒక డెబిట్ కార్డు సగటు లావాదేవీ రూ 1,000 ఉండగా... ఇప్పుడది రూ 350 కి తగ్గిపోయింది.
ప్రభుత్వం ఇప్పటికే రూ 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా... వాస్తవికంగా అందులో నిజమైన ఖర్చు కేవలం రూ 2 లక్షలకు మించి ఉండటం లేదు. కాబట్టి, దాని వల్ల జరిగే ప్రయోజనం తక్కువే. అందుకే, కరోనా లాక్ డౌన్ వల్ల దెబ్బతిన్న రంగాలకు మరో ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications