బంగారంపై రుణాలు తీసుకునే వారికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యోనో ఫ్లాట్ ఫామ్ ద్వారా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు వడ్డీలో డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందిస్తూ కస్టమర్లకు ఈజీ గోల్డ్ లోన్స్ ను అందిస్తోంది ఎస్బిఐ. కరోనా మహమ్మారి కష్టకాలంలో అత్యవసర సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు రుణాలను అందిస్తున్నాయి. ఇక వ్యక్తిగత రుణాలతో పాటుగా బంగారం మీద రుణాలను కూడా బ్యాంకులు పెద్ద ఎత్తున అందిస్తున్న పరిస్థితి ఉంది.

యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ కు అప్లై చేస్తే అసలు వడ్డీ రేటు కంటే 0.75 శాతం తక్కువ వడ్డీ రేటు
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 7.5 శాతం వడ్డీ రేటుతో బంగారంపై రుణాలను అందిస్తోంది. అంతేకాదు ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ లో కస్టమర్లు సులభంగా బంగారు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బిఐ వెల్లడించింది. బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ తనఖా బట్టి ఎస్బీఐ యోనో యాప్ ద్వారా తీసుకునే బంగారు రుణాలకు ఎస్బిఐ అందిస్తున్న రుణాల వడ్డీ రేటు కంటే 0.75 శాతం వడ్డీ రేటు తక్కువకు అందిస్తుంది. ఇక ఈ యాప్ లో కస్టమర్లు సులభంగా గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.సాధారణంగా, గోల్డ్ మీద ఇచ్చే రుణాలు ప్రస్తుత మార్కెట్ విలువ మరియు బంగారం నాణ్యత ఆధారంగా 80 శాతం వరకు ఉంటుంది.

ఎస్బీఐ యోనో యాప్ ద్వారా గోల్డ్ లోన్ కి దరఖాస్తు ఇలా
ఎస్బిఐ పర్సనల్ గోల్డ్ లోన్ తీసుకునేవారు ఎస్బీఐ యోనో యాప్ లో ఎలా అప్లై చేయాలంటే, మొదటిదశలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి యోనో యాప్ లో లాగిన్ అవ్వాలి. హోం పేజీలో మెనూలోకి వెళ్లి రుణాలపైన క్లిక్ చేయాలి. ఇక రుణాలలో గోల్డ్ లోన్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత గోల్డ్ లోన్ కు అప్లై చేయాలి. ఇక అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. పేరు, వృత్తి, నివాసం తదితర పర్సనల్ బయోడేటా ఇచ్చి, నెలసరి ఆదాయాన్ని అందులో పేర్కొనాలి . బ్యాంకులో లోన్ కోసం పెట్ట దలుచుకున్న బంగారం పరిమాణం, రకం, బరువు, క్యారెట్ తదితర అన్ని వివరాలతో అప్లికేషన్ ను పూర్తి చేసి సబ్మిట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

యాప్ లో అప్లై చేశాక బ్యాంకుకు వెళ్లి బంగారం పెట్టి ఋణం తీసుకోవటమే
ఇక రెండవ దశలో ఆ బంగారాన్ని తీసుకుని అప్లై చేసిన బ్యాంకు శాఖకు వెళ్లాలి. రెండు ఫోటోలను, సంబంధిత పత్రాలను అన్నింటినీ తీసుకొని, బంగారంతో పాటు బ్యాంకుకి వెళ్లి వాటిని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మూడవ దశలో పత్రాలపై సంతకం చేసి, నాలుగవ దశలో శాంక్షన్ అయిన గోల్డ్ లోన్ తీసుకోవాలి. ఇక ఎస్బిఐ పర్సనల్ గోల్డ్ లోన్ ఎవరు పొందవచ్చు అంటే స్థిరమైన ఆదాయ వనరుతో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, పెన్షనర్లు ఎస్బిఐ గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.

ఎస్బిఐ పర్సనల్ గోల్డ్ లోన్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్‌లు ఇవే
ఎస్బిఐ పర్సనల్ గోల్డ్ లోన్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్‌ల వివరాలు చూస్తే , పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేదు. రెండు ఫోటోలతో పాటుగా బంగారం రుణం కోసం దరఖాస్తు, చిరునామా కోసం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. ఇక గోల్డ్ లోన్ మొత్తం కనీసం ₹ 20,000 మరియు గరిష్ట మొత్తం ₹ 50 లక్షల వరకు ఉంటుంది. ఇందులో మార్జిన్ 25శాతం ఉంటుంది. ఎస్బిఐ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7.5 శాతంతో కస్టమర్లకు గోల్డ్ లోన్ అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications