రుణాలు తీసుకునే వారికి SBI గుడ్‌న్యూస్, వడ్డీ రేటు తగ్గింపు: డిపాజిటర్లకు షాక్

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణాలు తీసుకునే వారికి శుభవార్త చెప్పింది. డిపాజిటర్లకు మాత్రం చేదు. రుణాలపై వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. వివిధ కాలపరిమితులపై ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా తగ్గించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లు తగ్గించడంతో గత కొంతకాలంగా ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తోన్న విషయం తెలిసిందే.

రుణాలపై వడ్డీ రేటు ఎంత తగ్గించింది?

రుణాలపై వడ్డీ రేటు ఎంత తగ్గించింది?

ఎస్బీఐ వరుసగా రెండో నెల వడ్డీ రేటును తగ్గించింది. రుణాలపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (MCLR)లో కోత విధించింది.రుణాలపై వడ్డీ రేటు ఎంత తగ్గించింది?

ఎస్బీఐ వరుసగా రెండో నెల వడ్డీ రేటును తగ్గించింది. రుణాలపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. వివిధ కాలపరిమితితో కూడిన రుణాలపై నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (MCLR)లో కోత విధించింది.

రుణాలపై వడ్డీ రేటు ఇలా తగ్గింది

రుణాలపై వడ్డీ రేటు ఇలా తగ్గింది

- ఓవర్ నైట్ నుండి 1 నెల ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనిని 7.45 శాతానికి తగ్గించింది.

- 3 నెలల కాల పరిమితి వరకు వడ్డీ రేటును 7.65 శాతం నుండి 7.50 శాతానికి తగ్గించింది.

- ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 7.85 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించింది.

- ఏడాది నుండి మూడేళ్ల కాలపరిమితి వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనిని 8.05 శాతం నుండి 7.95 శాతానికి తగ్గించింది.

ఫిక్స్డ్ డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లు

ఫిక్స్డ్ డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లు

రుణాలపై వడ్డీ రేటు తగ్గితే కస్టమర్లకు ప్రయోజనం. ఫిక్స్డ్ డిపాజిట్లపై తగ్గితే కస్టమర్లకు డిపాజిట్లపై వడ్డీ తగ్గుతుంది. ఇప్పుడు వీటిని కూడా తగ్గించింది. ఏడాది అంతకుమించి కాలపరిమితిలపై వడ్డీ రేటును తగ్గించింది.

- 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య వడ్డీ రేటు 4 శాతం నుండి 4.5 శాతానికి పెంచింది. దీనిని మాత్రమే పెంచింది. మిగతా వాటిని తగ్గించింది.

తగ్గించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు

తగ్గించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు

- ఏడాది నుండి 2 ఏళ్ల కాలపరిమితి FDపై వడ్డీ రేటును 6 శాతం నుండి 5.90 శాతానికి తగ్గించారు.

- సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో 6.50 శాతం నుండి 6.40 శాతానికి తగ్గింది.

బల్క్ టర్మ్ డిపాజిట్లపై..

బల్క్ టర్మ్ డిపాజిట్లపై..

- రూ.2 కోట్లు అంతకుమించి బల్క్ టర్మ్ డిపాజిట్‌లపై వడ్డీ రేటును కూడా తగ్గించింది. 180 రోజులకు మించితే 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

- ఏడాదికి మించితే 4.75 శాతం నుండి 4.60 శాతానికి తగ్గించింది.

- రిటైల్ సెగ్మెంట్‌లో టర్మ్ డిపాజిట్ రేట్లను 10 బేసిస్ పాయింట్ల నుండి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. బల్క్ సెగ్మెంట్‌లో 25 బేసిస్ పాయింట్ల నుండి 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

మార్చి 10వ తేదీ నుండి అమలు

మార్చి 10వ తేదీ నుండి అమలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) ఎస్బీఐ వడ్డీ రేటును తగ్గించడం ఇది పదోసారి. ఈ వడ్డీ రేట్లు మార్చి 10వ తేదీ నుండే అమలులోకి వచ్చాయి. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా అన్ని కాలపరిమితులపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+