నష్టం జరిగితే బాధ్యత మాది కాదు: కస్టమర్లకు SBI హెచ్చరిక
కస్టమర్ ఎవరైనా తన అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత లేదా ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తే తద్వారా జరిగే నష్టానికి బ్యాంకు కారణం కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హెచ్చరించింది. సోషల్ మీడియాలో బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయవద్దని సూచించింది. దీని వల్ల ఖాతాదారులు నష్టపోతే తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపింది.

బాధ్యత మాది కాదు..
ఎస్బీఐకి చెందిన ఓ కస్టమర్ తన సేవింగ్స్ అకౌంట్ నెంబర్, ఇతర డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేశారు. దీనిపై ఎస్బీఐ స్పందించింది. ఆ పోస్టును డిలీట్ చేయాలని కోరింది. 'దయచేసి మీ అకౌంట్ నెంబర్‌ను షేర్ చేయవద్దు. సెక్యూరిటీ కారణాలతో మొబైల్ నెంబర్, ఇతర పర్సనల్ డిటెయిల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. ఇలా చేస్తే బ్యాంకు బాధ్యత వహించదు. వెంటనే పోస్ట్ తొలగించండి' అని పేర్కొంది.

వివరాలు అడగం...
ఎస్బీఐ లేదా బ్యాంకు ఉద్యోగులు ఎప్పుడు కూడా పేమెంట్‌కు సంబంధించిన లింక్స్ పంపించరని, అలాగే వీపీఏ-యూపీఐ సంబంధిత సెన్సిటివ్ సమాచారాన్ని అడగరని ఎస్బీఐ పేర్కొంది. యూజర్ ఐడీ, పిన్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్, సీవీవీ నెంబర్, ఓటీపీ వంటి వాటిని ఫోన్ లేదా ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ వంటి వివరాల గురించి కూడా అడగదని తెలిపింది.

ఎప్పటికప్పుడు హెచ్చరికలు
ఎస్బీఐతో పాటు అన్ని బ్యాంకులు కూడా కస్టమర్లకు ఎప్పటికి అప్పుడు ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా వివిధ సందర్భాలలో సందేశాలు పంపిస్తారు. ఎస్సెమ్మెస్ లేదా మెయిల్స్ ద్వారా వచ్చే లింక్స్ క్లిక్ చేసి, వ్యక్తిగత సమాచారాం ఇవ్వవద్దని సూచిస్తాయి. అనుమానాస్పద లింక్స్‌తో మీ సమచారాన్ని షేర్ చేయవద్దని చెబుతాయి.


Click it and Unblock the Notifications