మీ దగ్గర ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉందా.. ఈ రూల్స్ మరాయి తెలుసా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు ఒక అలర్ట్ అందించింది. సాధారణంగా ఏదైనా ట్రాన్సక్షన్స్ పై రివార్డ్ పాయింట్‌లు లభిస్తుంటాయి. అయితే డిసెంబరు 1 నుండి కొన్ని క్రెడిట్ కార్డ్‌ల ట్రాన్సక్షన్స్ పై రివార్డ్ పాయింట్‌లను నిలిపివేసింది. ఎస్బిఐ కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం, 1 డిసెంబర్ 2024 నుండి డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్/ మర్చంట్స్ పై చేసిన ట్రాన్సక్షన్స్ కి రివార్డ్ పాయింట్‌లను కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు నిలిపివేసినట్లు తెలిపింది.
డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్స్ రివార్డ్ పాయింట్‌లు వర్తించని ఎస్బిఐ క్రెడిట్ కార్డ్‌ల లిస్ట్:
ఎస్బిఐ కార్డ్ ఎలైట్, ఎస్బిఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, ఎస్బిఐ కార్డ్ పల్స్, సింప్లి క్లిక్ ఎస్బిఐ కార్డ్, సింప్లి క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బిఐ కార్డ్, ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, ఎస్బిఐ కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్, ఎస్బిఐ కార్డ్ ప్లాటినం, ఎస్బిఐ కార్డ్ ప్రైమ్ ప్రో, ఎస్బిఐ కార్డ్ ప్లాటినం అడ్వాంటేజ్, గోల్డ్ ఎస్బిఐ కార్డ్, గోల్డ్ క్లాసిక్ ఎస్బిఐ కార్డ్, గోల్డ్ డిఫెన్స్ ఎస్బిఐ కార్డ్, గోల్డ్ & మోర్ ఎంప్లాయ్ ఎస్బిఐ కార్డ్, గోల్డ్ & మోర్ అడ్వాంటేజ్ , ఎస్బిఐ కార్డ్, గోల్డ్ & మోర్ ఎస్బిఐ కార్డ్, సింప్లి సేవ్ ఎస్బిఐ కార్డ్, సింప్లి సేవ్ ఎంప్లాయ్ ఎస్బిఐ కార్డ్, సింప్లి సేవ్ అడ్వాంటేజ్ ఎస్బిఐ కార్డ్,
గోల్డ్ & మోర్ టైటానియం ఎస్బిఐ కార్డ్, సింప్లి సేవ్ ప్రో ఎస్బిఐ కార్డ్, క్రిషక్ ఉన్నతి ఎస్బిఐ కార్డ్, సింప్లి సేవ్ మర్చంట్ ఎస్బిఐ కార్డ్, సింప్లి సేవ్ యుపిఐ ఎస్బిఐ కార్డ్, కెవిబి ఎస్బిఐ ప్లాటినం కార్డ్, కెవిబి ఎస్బిఐ గోల్డ్ & మోర్ కార్డ్, కెవిబి ఎస్బిఐ సిగ్నేచర్ కార్డ్, కర్ణాటక బ్యాంక్ ఎస్బిఐ ప్లాటినం కార్డ్, కర్ణాటక బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, అలహాబాద్ బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్, అలహాబాద్ బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, సిటీ యూనియన్ బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, సిటీ యూనియన్ బ్యాంక్ సింప్లి SBI కార్డ్, సెంట్రల్ బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, యూకో బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, యూకో బ్యాంక్ ఎస్బిఐ కార్డ్ ఎలైట్, పిఎస్బి ఎస్బిఐ కార్డ్ ఎలైట్, పిఎస్బి ఎస్బిఐ కార్డ్ ప్రైమ్, శౌర్య ఎస్బిఐ కార్డ్ ఇంకా మరికొన్ని కార్డ్స్ ఉన్నాయి.

డిసెంబర్ 1 నుండి యుటిలిటీ పేమెంట్స్ మార్పులు
బిల్లింగ్ టైంలో చేసిన యుటిలిటీ పేమెంట్స్ మొత్తం రూ.50,000 కంటే మించి ఉంటే 1% చార్జెస్ వర్తిస్తాయి. యుటిలిటీ పేమెంట్స్ లో టెలిఫోన్, మొబైల్, కరెంట్ బిల్లు ఇంకా ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications