Home Loan: భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ.. ఎస్బీఐ మాత్రం రుణగ్రహీతలకు బ్యాడ్ న్యూస్ తెలిపింది.
స్టేట్ బ్యాంక్ తన గృహ రుణాలపై తాజాగా MCLR, బేస్ వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. తాజా ప్రకటన ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేస్ రేటు 0.15 శాతం, MCLR రేటు 0.10 శాతం పెరిగింది. దీనిలో MCLR అనేది ప్రతి బ్యాంకు తన కస్టమర్లకు అందించే కనీస క్రెడిట్ పరిమితి.

MCLR రేటు లోన్ రకం, రుణగ్రహీత, లోన్ కాలవ్యవధి, సదరు వ్యక్తుల CIBIL స్కోర్ ఆధారంగా మారుతుంది. MCLR రేటు ప్రస్తుతం 8.85 శాతంగా లెక్కించబడుతోంది. అలాగే స్టేట్ బ్యాంక్ కొత్త రుణాలకు బేస్ రేటును నేటి నుంచి 10.10 శాతం నుంచి 10.25 శాతానికి పెంచింది. ఒక రోజుకు 8 శాతం, ఒక నెలకు 8.2 శాతం, 6 నెలలకు 8.55 శాతం, ఏడాదికి 8.65 శాతం, 2 సంవత్సరాలకు 8.75 శాతం, 3 సంవత్సరాలకు 8.85 శాతం వడ్డీ రేటు ఉంటుందని MCLR ప్రకటించింది.
బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు 15 శాతానికి పెరిగింది. అంతకుముందు ఇది 14.85 శాతంగా ఉండటం గమనార్హం. తాజా పెంపుల కారణంగా SBI బ్యాంక్ అన్ని రుణాలకు వడ్డీ రేటు, EMI మొత్తం మారుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై ప్రస్తుతం 0.65 శాతం వరకు వడ్డీ తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ కింద రుణం తీసుకుంటే ఒక సంవత్సరం వరకు వడ్డీ రేటు మారదు. అందువల్ల, కొత్త వడ్డీ రేటు కొత్త రుణగ్రహీతలు, ఒక సంవత్సరం కంటే తక్కువ రుణ కాల వ్యవధి ఉన్న వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపదు.


Click it and Unblock the Notifications