SBI News: స్టేట్ బ్యాంక్‌కి అస్సలు అది సమస్యే కాదు.. చైర్మన్ దినేష్ ఖరా స్పష్టం..
State Bank of India: ఇటీవలి కాలంలో ఆర్బీఐ నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్షలో దేశంలోని బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయుల పొదుపు విషయంలో వచ్చిన మార్పులను ఈ క్రమంలో లేవనెత్తింది.
దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ల తగ్గుదలపై ఆర్బీఐ ఆందోళన తర్వాత తొలిసారిగా స్పందించింది. దీనిపై చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ బ్యాంక్ ప్రస్తుతం డిపాజిట్ల వృద్ధి విషయంలో ఎలాంటి సవాళ్లను చూడటం లేదని పేర్కొంది. తాము లోన్ బుక్ వృద్ధికి బాగా మద్దతునిచ్చే స్థితిలో నిధులను కలిగి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. లోన్ బుక్ విస్తరణకు అన్నివిధాలా మద్దతునిచ్చే స్థితిలో ఉన్నామని, ఎటువంటి సవాళ్లు ఉండవని భావిస్తున్నట్లు నిన్న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన గత ఏడాది ఇదే కాలంలో రూ.45.31 లక్షల కోట్ల నుంచి 8.18 శాతం పెరిగి రూ.49.02 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. అయితే సీక్వెన్షియల్ ప్రాతిపదికన బ్యాంకు డిపాజిట్లు స్వల్పంగా 0.29 శాతం తగ్గుదలను చూశాయి. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ వృద్ధి సవాలు, అభివృద్ధి చెందుతున్న మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల కంటే బ్యాంకింగ్ వ్యవస్థ పెద్దదని ఖరా అన్నారు.
ఇదే క్రమంలో ఖరా మాట్లాడుతూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ మార్కెట్‌ల కంటే పెద్దదిగా కొనసాగుతోందని అన్నారు. ఇందులో ఎక్కువ భాగం పెట్టుబడిదారుల ఎంపిక, బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రూపొందించబడే ఉత్పత్తుల రకంగా ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెుత్తానికి స్టేట్ బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోవటం లేదని వెల్లడించింది. బలమైన ఆర్థిక పునాది, నిధుల లభ్యతతో ముందుకు సాగుతున్నట్లు ఖరా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications