ప్రముఖ క్రెడిట్ కార్డ్ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్ (SBI Cards) తన యూజర్లకు కీలక సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా పాపులర్ అయిన 'క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్' (Cashback SBI Card) ప్రయోజనాల్లో మార్పులు చేయడంతో పాటు, రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ విధానాన్ని కూడా సవరించింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి.

1. క్యాష్‌బ్యాక్ ఎస్‌బీఐ కార్డ్ పై పరిమితులు
ఇప్పటివరకు ఉన్న గరిష్ట క్యాష్‌బ్యాక్ పరిమితిని తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో గరిష్టంగా రూ.4,000 మాత్రమే క్యాష్‌బ్యాక్ పొందగలరు. దీని విభజన ఇలా ఉంది..
- ఆన్‌లైన్ షాపింగ్: 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కానీ, ఇది గరిష్టంగా రూ.2,000 కు పరిమితం.
- ఆఫ్‌లైన్ (POS) లావాదేవీలు: 1% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, ఇది కూడా గరిష్టంగా రూ.2,000 వరకు మాత్రమే.
- మినహాయింపులు: డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, టోల్ చెల్లింపులు, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై ఇకపై ఎటువంటి క్యాష్‌బ్యాక్ లభించదు.
2. రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ లో మార్పులు
మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్లను స్టేట్‌మెంట్ క్రెడిట్ (నగదుగా) మార్చుకోవాలనుకుంటే కొత్త రూల్స్ ఇవే..
- నెలవారీ పరిమితి: నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లను మాత్రమే స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా మార్చుకోవచ్చు.
- గుణకాలు (Multiples): రివార్డ్ పాయింట్లను కేవలం 4,000 గుణకాలలో మాత్రమే రిడీమ్ చేయాలి (ఉదాహరణకు: 4000, 8000, 12000...). అంతకంటే తక్కువ పాయింట్లు ఉంటే రిడీమ్ చేయడం సాధ్యపడదు.
- మినహాయింపు కార్డ్స్: ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్, ఫోన్‌పే ఎస్‌బీఐ పర్పుల్ , సెలెక్ట్ బ్లాక్ కార్డ్‌లకు ఈ పరిమితుల నుండి మినహాయింపు ఉంది.
3. పాయింట్ల రద్దు (Forfeiture) నిబంధనలు
ప్రమోషనల్ ఆఫర్ల ద్వారా వచ్చే పాయింట్ల విషయంలో కూడా కఠిన నిబంధనలు వచ్చాయి..
- • క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ పోస్ట్ అయిన 90 రోజుల్లోపు రద్దవుతాయి.
- • ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా వచ్చిన పాయింట్లు ఆఫర్ ముగిసిన 120 రోజుల్లోపు రద్దవుతాయి.
ఏదేమైనా SBI తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే (Heavy Spenders) కార్డ్ యూజర్లపై ప్రభావం పడనుంది. కాబట్టి SBI Card వాడుతున్న వారు ఏప్రిల్ 1 లోపే తమ పాయింట్లను రిడీమ్ చేసుకోవడం లేదా కొత్త పరిమితులకు అనుగుణంగా షాపింగ్ ప్లాన్ చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications