SBI Card: ఎస్బీఐ కార్డ్ పండుగ ఆఫర్లు.. 27.5% వరకు క్యాష్‌బ్యాక్.. పూర్తి వివరాలు..
SBI Card: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. దీంతో చాలా మంది షాపింగ్ మెుదలు పెట్టారు. దీంతో ఎస్బీఐ కార్డ్ తన వినియోగదారులకు బోలెడన్ని ఆఫర్లతో ముందుకొచ్చింది.
పండుగల సీజన్ 2023 సందర్భంగా దేశంలోని తన కార్డు హోల్డర్లకు అనేక అద్భుతమైన ఆఫర్లను ఎస్బీఐ తీసుకొచ్చింది. సుమారు 2200 మర్చంట్ ఫండెడ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను తెచ్చింది. ఇవి ఆన్‌లైన్‌తో పాటు టైర్-2, టైర్-3 నగరాలతో సహా ప్రముఖ నగరాల్లో సెల్లర్ల నుంచి అందుకోవచ్చని వెల్లడించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఫ్యాషన్, ఫర్నీచర్, ఆభరణాలు సహా ఇతర క్యాటగిరీల్లో అనేక ఈఎంఐ ఫోకస్డ్ ఆఫర్లను సెస్బీఐ కార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

వినియోగదారుల కోసం 600లకు పైగా జాతీయ స్థాయి ఆఫర్లు, 1500 వరకు స్థానిక ఆఫర్లను నవంబర్ 15, 2023 వరకు చెల్లుబాటు అయ్యేలా ప్రవేశపెట్టింది. ఈ పండుగ ఆఫర్ లో భాగంగా 2700 పైగా నగరాలలోని ఎస్బీఐ కార్డ్ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, రిలయన్స్ రీటెయిల్ గ్రూప్, వెస్ట్సైట్, పాంటలూన్స్, మ్యాక్స్, తనిష్క్, టీబీజెడ్ వంటి వివిధ భాగస్వామ్య బ్రాండ్లలో 27.5% వరకు క్యాష్‌బ్యాక్, తక్షణ డిస్కౌంట్లను పొందొచ్చు. అలాగే సాంసంగ్, ఎల్జీ, సోనీ, ఓప్పో, వివో, పానసోనిక్, వర్ల్‌పూల్, బాష్, ఐఎఫ్బీ, హెచ్‌పీ, డెల్ తో పాటు మరెన్నో బ్లాండ్ల ఎలక్ట్రానిక్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కస్టమర్ ఓరియెంటెడ్ సేవలను అందించే బ్లాండుగా వారి అనుభవాన్ని పెంచటంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవో అభిజీత్ చక్రవర్తి పేర్కొన్నారు. షాపింగ్ అనుభవాన్ని మరింత ప్రతిఫలాన్ని అందించేవిగా ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎస్బిఐ కార్డ్ పండుగ ఆఫర్ 2023 ఒక గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఈ పండుగ సీజన్లో తమ కార్డులపై షాపింగ్ చేసే కస్టమర్ల సంతోషాన్ని, సంబరాలను తమ ఆఫర్లు మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పండుగ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు www.sbicard.com/festive సందర్శించండి.


Click it and Unblock the Notifications