SBI News: గత ఏడాదిగా రిజర్వు బ్యాంక్ దేశంలో వడ్డీ రేట్లను పెంచటం బ్యాంకులకు కొంత మేర ఇబ్బందులను కలిగిస్తోంది. ఈ చర్య వారి వద్ద ఉండే లిక్విడిటీని దెబ్బతీసింది. ఈ క్రమంలో అనేక బ్యాంకులు తమ మూలధన అవసరాల కోసం నిధుల వేటలో పడ్డాయి.
అప్రమత్తమైన దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ తన అవసరాల కోసం నిధుల సమీకరణకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ ప్లైస్మెంట్ పద్ధతిలో డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల జారీ ద్వారా రూ.50,000 కోట్ల వరకు నిధుల సమీకరించాలని నిర్ణయించింది. తాజాగా బ్యాంక్ బోర్డ్ సైతం ఇందుకు ఆమోదం తెలిపింది. అయితే ఇవి భారత ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఉంటుందని స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన వివరాల్లో వెల్లడించింది.

ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఎస్బీఐ స్టాక్ ఎన్ఎస్ఈలో 1.69 శాతం తగ్గి రూ.578.55 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత అయిన SBI తన విదేశీ వ్యాపార వృద్ధికి నిధులు సమకూర్చడానికి 10 బిలియన్ డాలర్ల గ్లోబల్ మీడియం నోట్ ప్రోగ్రామ్ కింద 750 మిలియన్ డాలర్లను సేకరించింది.
గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి గాంధీనగర్‌లోని INX గ్లోబల్ సెక్యూరిటీస్ మార్కెట్ (GSM), GIFT ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (IFSC) వద్ద ఈ ఫండ్ సేకరించబడింది. ఆఫ్‌షోర్ వ్యాపార వృద్ధికి నిధులు సమకూర్చడానికి SBI తన లండన్ బ్రాంచ్ ద్వారా బాండ్‌లను జారీ చేసింది. ఇది ఇండియాలోని అతిపెద్ద బ్యాంకుపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఇది ఈ ఏడాది చేపట్టే విదేశీ కరెన్సీ బాండ్ జారీకి బలమైన పైప్‌లైన్‌కు మార్గం సుగమం చేస్తుందని బ్యాంక్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications