SBI Q1 Results: తుఫాను లాభాల్లో ఎస్‌బీఐ.. పెరిగిన అసెట్స్ క్వాలిటీ..
SBI Q1 Results: ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్యూ1 ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో విశ్లేషకుల అంచనాలకు మించిన పనితీరును కనబరిచింది.
జూన్ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ రూ.16,884.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,068.08 కోట్ల లాభం కంటే ఇది 178.24 శాతం అధికం. వరుసగా నాలుగో త్రైమాసికంలో ఇదే రికార్డు నికర లాభం. ఇది మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన 12.-160 శాతం వృద్ధి కంటే ఎక్కువ కావటం గమనార్హం. ఈ క్రమంలో నికర వడ్డీ ఆదాయం రూ.38,905 కోట్లుగా నమోదైంది. గత ఏడాది కంటే ఇది 24.71 శాతం అధికం.

ఇదే క్రమంలో నికర వడ్డీ మార్జిన్(NIM) గత ఏడాది త్రైమాసికంలో 3.23 శాతం నుంచి జూన్ త్రైమాసికంలో 24 బేసిస్ పాయింట్లు పెరిగి 3.47 శాతానికి మెరుగుపడింది. అయితే మార్చి త్రైమాసికంలో NIM 3.84 శాతం కంటే 37 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఇదే క్రమంలో ఎసెట్ క్వాలిటీ మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.76 శాతంగా ఉంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకు ఈ త్రైమాసికానికి రూ.2,501.31 కోట్ల విలువైన కేటాయింపులు చేసింది.
జూన్ 30, 2022 నాటికి రూ.29,00,636 కోట్లతో పోలిస్తే స్థూల అడ్వాన్సులు 13.90 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరాయని బ్యాంక్ నివేదించింది. అలాగే డిపాజిట్లు రూ.45,31,237 కోట్ల నుంచి రూ.45,31,237 కోట్లకు పెరిగాయి. క్రెడిట్ ఖర్చు 0.32 శాతం ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో 0.61 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications