SBI కస్టమర్లకు అలర్ట్! వరుసగా 6 రోజులు బ్యాంక్ సెలవులు.. వెంటనే ఈ పనులు ముగించుకోండి!

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో అకౌంట్ ఉందా? ఈ నెల చివర్లో బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. మే నెల చివరి వారంలో దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచ్‌లు వరుసగా ఆరు రోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. బ్యాంక్ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె, వారాంతపు సెలవులు , బక్రీద్ పండుగ సెలవులు అన్నీ ఒకేసారి రావడమే దీనికి ప్రధాన కారణం. ఈ సుదీర్ఘ సెలవుల (Bank holidays) వల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ముందే అలర్ట్ అవ్వడం మంచిది.

SBI Bank Holidays May 2026 Nationwide Strike AISBISF Branch Closure ATM UPI

ఆరు రోజుల సెలవుల షెడ్యూల్ (మే 23 - మే 28)

  • మే 23: నాల్గవ శనివారం (Fourగవ Saturday) కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
  • మే 24: ఆదివారం సాధారణ వీక్లీ సెలవు.
  • మే 25 & మే 26: ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
  • మే 27 & మే 28: బక్రీద్ (Bakrid) పండుగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నాయి.

ఈ లెక్కన మే 23 నుండి మే 28 వరకు వరుసగా 6 రోజుల పాటు ఎస్బీఐ కస్టమర్లకు బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ చరిత్రలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన బ్రాంచ్ బంద్‌గా మారే అవకాశం ఉంది.

ఎస్బీఐ ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారు?

ఈ సమ్మె ప్రధానంగా వర్క్‌మెన్ (Workmen) కేటగిరీకి చెందిన ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదని, గతంలో జరిగిన ఒప్పందాలను సరిగ్గా అమలు చేయడం లేదని యూనియన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్ (AISBISF) బ్యాంక్ యాజమాన్యానికి 16 డిమాండ్లతో కూడిన నోటీసును సమర్పించింది..

  • కొత్త రిక్రూట్‌మెంట్లు: గత కొన్నేళ్లుగా మెసెంజర్, సపోర్ట్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయడం వల్ల ఆ పోస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వెంటనే కొత్త నియామకాలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
  • భద్రతా లోపాలు: బ్యాంక్ బ్రాంచ్‌లలో ఆర్మ్‌డ్ గార్డ్స్ (తుపాకులు కలిగిన సెక్యూరిటీ గార్డ్స్) లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
  • ఎన్‌పీఎస్ సమస్యలు: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉద్యోగులకు ఉన్నట్లుగా, తమకు నచ్చిన పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఎస్బీఐ ఉద్యోగులకు లేదు. ఈ వివక్షను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
  • జీతాల అసమానత: ఆఫీసర్ కేటగిరీ వారికి ప్రత్యేక అలవెన్సులు , శాలరీ బెనిఫిట్స్ ఇస్తూ, వర్క్‌మెన్ స్టాఫ్‌ను పక్కన పెట్టడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కస్టమర్లు ఏమి చేయాలి?

ఈ సుదీర్ఘ బ్యాంక్ సెలవుల (Bank holidays) వల్ల లావాదేవీలు నిలిచిపోకుండా ఉండాలంటే.. కస్టమర్లు తమ ముఖ్యమైన పనులైన నగదు డిపాజిట్లు, పెద్ద మొత్తంలో విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్, పాస్‌బుక్ అప్‌డేట్లు, లోన్ డాక్యుమెంటేషన్ , అకౌంట్ వెరిఫికేషన్ వంటి పనులను మే 23 కంటే ముందే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇకపోతే డిజిటల్ లావాదేవీలు యథాతథంగా జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+