SBI Scholarship: విద్యార్థులకు SBI స్కాలర్ షిప్.. ఏడాదికి రూ.15 వేలు.. దరఖాస్తు పూర్తి వివరాలు..
SBI Scholarship: దేశంలో చాలా చోట్ల విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు వారికి ప్రతికూలంగా నిలుస్తున్నాయి. వీటికి తోడు మట్టిలో మాణిక్యాల్లా ఉన్న పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే విరమించుకుంటున్నారు. కానీ ఇలాంటి వారికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రతిభ కలగిన, చదువుకోవటానికి స్థోమతలేని విద్యార్థులకు దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకొచ్చింది. SBI ASHA SCHOLARSHIP PROGRAM-2022 పేరుతో దీనిని అందిస్తోంది. SBI ఫౌండేషన్.. buddy4study అనే మరో సంస్థతో కలిసి వీటిని అందిస్తోంది. దీని కింద రిజిస్టర్ చేసుకోవాలనుకునేవారు https://buddy4study.com/page/sbi-asha-scholarship-program లింక్ లో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు గమనిద్దాం.
రూ.15 వేలు స్కాలర్ షిప్..
బడ్డి4స్టడీ అనే మరో ఫౌండేషన్ తో కలిసి ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువుల ఖర్చుల నిమిత్తం అందిస్తున్న స్కాలర్ షిప్స్ పొందటానికి ఉన్న అర్హతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అవకాశం 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థిలకు మాత్రమే అవకాశం ఉంది. ఎంపికైన వ్యక్తికి ఏడాదికి రూ.15,000 స్కాలర్ షిప్ అందిస్తారు.

దరఖాస్తు చివరి తేదీ..
SBI అందిస్తున్న స్కాలర్ షిప్ పొందటానికి దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ అక్టోబర్ 15, 2022 అని వెల్లడించింది. ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థులకు నెలరోజులకు పైగా సమయం ఉంది. సమయం ఉన్నప్పటికీ అర్హులైన విద్యార్థలు ముందుగానే ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయటం ఉత్తమం.

స్కాలర్ షిప్ పొందేందుకు అర్హతలు:
* 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవకాశం
* గడిచిన అకాడమిక్ పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి
* విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.3 లక్షలు దాటకూడదు

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
* గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్క్స్ మెమో
* ఆధార్/పాన్/రేషన్ కార్డులు
* పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
* ఇన్కమ్ సర్టిఫికెట్
* చదువుతున్న స్కూల్ ప్రస్తుత అడ్మిషన్ సర్టిఫికెట్
* బ్యాంక్ అకౌంట్ వివరాలు


Click it and Unblock the Notifications