SBI Amrit Kalash FD: మరికొద్ది రోజుల్లో వడ్డీ రేట్ల తగ్గింపులు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ప్రారంభించనున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు చివరి అవకాశాన్ని కోల్పోకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సదవకాశం గడవును పొడిగించింది.
ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల కాలం త్వరలో ముగియనున్న వేళ ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులకు అధిక వడ్డీని అందించే దారులు క్రమంగా మూసుకుపోనున్నాయి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అమృత్ కలాష్ FD పథకం పొడిగించటం ద్వారా పెట్టుబడిదారులకు చివరి అవకాశాన్ని ఇప్పటికీ తెరిచే ఉంచింది. వాస్తవానికి అమృత్ కలాష్ అనేది 400 రోజుల FD స్కీమ్, ఇందులో కస్టమర్‌లు గరిష్టంగా 7.60 శాతం వడ్డీని పొందుతారు. బ్యాంక్ ఈ పథకాన్ని మొదటిసారి ఏప్రిల్ 12, 2023న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు బ్యాంక్ స్కీమ్ గడువును పొడిగించింది.

అయితే ఆఖరిసారి పథకం గడువును సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించింది. దీంతో పెట్టుబడిదారుల చూపు ఈ పెట్టుబడి స్కీమ్ పై కొనసాగుతోంది. 400 రోజులకు పెట్టుబడిపై సాధారణ కస్టమర్‌లు గరిష్టంగా 7.10 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్ కస్టమర్‌లు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 7.60 శాతం వడ్డీని అమృత్ కలాష్ అందిస్తోంది. స్కీమ్ కింద ఇన్వెస్టర్లు గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు సొమ్మును డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వ బ్యాంక్ సదవకాశాన్ని అందుబాటులో ఉంచింది.
ఇటీవలి కాలంలో రిజర్వు బ్యాంక్ దేశీయ బ్యాంకుల్లో తగ్గిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత అనేక బ్యాంకులు ఆకర్షనీయమైన వడ్డీ పథకాలను ఇన్వెస్టర్ల కోసం చేరువచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు కస్టమర్లు తమకు సమీపంలోని బ్యాంక్ బ్రాంచిని సందర్శించవచ్చు. పథకం కింద డబ్బును దాచుకునేందుకు ఇన్వెస్టర్లు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications