కస్టమర్ టు షేర్‌హోల్డర్.. దేశంలోనే అతిపెద్ద ఫండ్ హౌస్ IPOకి వస్తోంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే..

భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే పేరు 'ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్'. ప్రతి నెల ఎస్ఐపీ (SIP) రూపంలో లక్షలాది మంది సామాన్యులు ఇందులో డబ్బులు దాచుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం కస్టమర్లుగా ఉన్న ఇన్వెస్టర్లకు ఇప్పుడు ఆ సంస్థలోనే భాగస్వాములు (Shareholders) అయ్యే సువర్ణ అవకాశం రాబోతోంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) అయిన 'ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్' పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది.

ఈ మెగా IPO కి సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ 'సెబీ' (SEBI) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జూలై నెలలో దీనికి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ (ధర) వివరాలు అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.

SBI AMC IPO gets SEBI approval price band announcement expected in July

మ్యూచువల్ ఫండ్‌కు, ఏఎంసీ షేర్లకు తేడా ఏంటి?

చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే.. మేము ఆల్రెడీ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, మళ్లీ ఈ ఐపీఓ ఏంటి? అని. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో (ఉదాహరణకు SBI Midcap లేదా Small Cap) డబ్బులు పెడితే, ఆ ఫండ్స్ మార్కెట్లో సాధించే పర్ఫార్మెన్స్ బట్టి మీకు రిటర్న్స్ వస్తాయి.

కానీ ఏఎంసీ (AMC) కంపెనీ షేర్లు కొంటే.. అసలు ఆ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ఎలా సాగుతోంది, కంపెనీకి ఎంత లాభం వస్తోంది అనే దాన్ని బట్టి మీ షేర్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఫండ్ హౌస్ సంపాదించే కమిషన్లు, ఫీజుల ద్వారా వచ్చే లాభాల్లో మీరు భాగస్వాములు అవుతారన్నమాట.

ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు

ఈ IPO లో డబ్బులు పెట్టే ముందు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

• ఇది ఆఫర్ ఫర్ సేల్ (OFS): ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బు కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడదు. కేవలం ప్రస్తుతం ఉన్న వాటాదారులు (SBI , అముండి ఇండియా) తమ షేర్లను అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారు.

• వ్యాల్యుయేషన్ ముఖ్యం: కేవలం 'SBI' అనే బ్రాండ్ నేమ్ చూసి బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయకూడదు. జూలైలో ధర ప్రకటించాక.. మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ (HDFC AMC), నిప్పాన్ లైఫ్ వంటి కంపెనీల ధరలతో పోల్చి చూసుకుని నిర్ణయం తీసుకోవాలి. ధర రీజనబుల్‌గా ఉంటేనే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించాలి.

మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది?

ప్రస్తుతం ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్‌కు తిరుగులేదు. ప్రతి ఇల్లూ సేవింగ్స్ వైపు కాకుండా స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది. నెలకు వేల కోట్ల రూపాయలు ఎస్ఐపీల రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎస్‌బీఐ ఏఎంసీకి భవిష్యత్తులో మంచి గ్రోత్ ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే షేర్ మార్కెట్లో రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి, కంపెనీ ఫండమెంటల్స్ పూర్తిగా చెక్ చేసుకుని, జూలైలో రాబోయే ప్రైస్ బ్యాండ్‌ను బట్టి ముందడుగు వేయడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+