IPO News: తొలిరోజే ఐపీవో లాభాల భీబత్సం.. సంబరాల్లో ఇన్వెస్టర్లు.. మీరూ కొన్నారా..??
IPO News: చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుత అస్థిర మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోలను లాభాలిచ్చే లంకెబిందెల్లా చూస్తున్నారు. అలా షేర్లు అలాట్ అవగానే లిస్టింగ్ గెయిన్స్ తీసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఇది మంచి లాభాలను సైతం వారికి అందిస్తోంది.
ఈరోజు మార్కెట్లలోకి ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు అడుగుపెట్టాయి. ఈ క్రమంలో బలమైన లిస్టింగ్ నమోదు చేసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో స్టాక్ ఇష్యూ ధర కంటే 44 శాతం అధిక ప్రీమియం రేటుకు లిస్ట్ జరిగింది. దీంతో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల సంతోషంలో ఉన్నారు. ఒక్కరోజులోనే వారి పెట్టుబడి విలువ భారీగా పెరిగిపోయింది.

కంపెనీ తన షేర్లను రూ.57కు విడుదల చేసినప్పటికీ.. రూ.82 ధరకు లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్‌కు ముందే SBFC స్టాక్ గ్రే మార్కెట్‌లో రూ.30 ప్రీమియంలో ట్రేడయ్యాయి. ఇది కంపెనీ షేర్ల పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న ఆసక్తిని ప్రకటిస్తుంది. ఈ ఐపీవో ఇన్వెస్టర్ల కోసం ఆగస్టు 3 నుంచి 7 వరకు తెరచి ఉంది. ఈ క్రమంలో ప్రైస్ బ్యాండ్ రూ.54-57గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో ద్వారా కంపెనీ మెుత్తం రూ.1,025 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తగినట్లుగానే ఇన్వెస్టర్ల నుంచి షేర్ల కోసం మంచి స్పందన కనిపించింది.
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(QII) పోర్షన్ 203.61 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేయబడింది. అలాగే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(NII) 51.82 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఇక రిటైల్ విభాగం 11.60 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. నేడు లిస్టింగ్ తర్వాత ఒక్కో లాటు షేర్లపై ఇన్వెస్టర్లు ఏకంగా రూ.6,500 లాభంగా పొందారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో 62 శాతానికిపైగా లాభపడి రూ.91.75 వద్ద ఉంది. SBFC ఫైనాన్స్ దేశంలోని 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మెుత్తంగా 105 నగరాల్లో వ్యాపారాన్ని కలిగి ఉంది. దీనికి 157 కంటే ఎక్కువ విస్తృత బ్రాంచ్ నెట్‌వర్క్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications