Savitri Jindal: భారత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. 2005లో భర్త ఆకస్మిక మరణం తర్వాత సావిత్రి జిందాల్ కుటుంబానికి చెందిన ఉక్కు, పవర్ వ్యాపారాల బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లలో ఆమె సంపద 12 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. 18 బిలియన్ డాలర్ల నికర విలువతో, జిందాల్ దేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో మొదటి 10 మందిలో నిలిచిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించారు. నియంత్రణ కోసం నీడల నుండి బయటపడిన మహిళ యొక్క విశేషమైన కథనాన్ని ఇక్కడ చూడండి. ఆమె ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

సావిత్రి జిందాల్ ఏమన్నారంటే..
సావిత్రి జిందాల్‌కు 55 ఏళ్ల వయసులో ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో సావిత్రి జిందాల్ దివంగత భర్త వ్యాపార సామ్రాజ్య పగ్గాలు చేపట్టారు. ఆమె నేతృత్వంలో ప్రస్తుతం కంపెనీ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఫోర్బ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కుటుంబంలో మహిళలు కేవలం ఇంటి బాధ్యతలు చూసుకుంటారని, పురుషులు వ్యాపారంతో పాటు ఇతర విషయాలను చూసుకుంటారని తెలిపారు.

ఆమె పుట్టింది అస్సాంలో..
మార్చి 20, 1950లో అస్సాంలోని టిన్సుకియా అనే పట్టణంలో జన్మించారు సావిత్రి. 1970లలో ఓం ప్రకాష్ జిందాల్‌ను వివాహం జరిగింది. అప్పట్లో ఆయన హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా, హర్యానా విధానసభ సభ్యుడిగా ఉన్నారు. పైగా విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. భర్త మరణంతో 2005లో హిసార్ నియోజకవర్గం నుంచి సావిత్రి జిందాల్ హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు.

తొమ్మిది మంది వారసులు..
తొమ్మిది మంది పిల్లల తల్లి, సావిత్రి జిందాల్‌కు OP జిందాల్‌తో నలుగురు కుమారులు ఉన్నారు. పృథ్వీరాజ్, సజ్జన్, రతన్, నవీన్ జిందాల్ ల మధ్య గ్రూప్ కంపెనీలను విభజించటం జరిగింది. సావిత్రి జిందాల్ నికర విలువ 2020లో 4.8 బిలియన్ డాలర్ల నుంచి 2022లో 17.7 బిలియన్ డాలర్లకు అంటే మూడు రెట్లు పెరిగింది. అనేక ఇతర బిలియనీర్‌ల మాదిరిగానే.. ఆమె కూడా 2021 ప్రథమార్ధంలో తన సంపదను పెంచుకున్నారు.


Click it and Unblock the Notifications