చమురు ధరలపై బిగ్ బ్రేకింగ్ న్యూస్.. అకస్మాత్తుగా ధరలను తగ్గించేసిన సౌదీ అరేబియా.. కారణం ఏంటంటే..

Saudi Oil Price Cut: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి దారైన సౌదీ అరేబియా, ఆసియా దేశాల కోసం నవంబర్ నెలకు సంబంధించిన ముడి చమురు విక్రయ ధరలలో (OSP) అనూహ్యంగా భారీ కోత విధిస్తూ సంచలన ప్రకటన విడుదల చేసింది. మార్కెట్ విశ్లేషకులు $3 పెరుగుతుందని అంచనా వేసిన చోట, సౌదీ అరామ్కో ఏకంగా $3 మేర తగ్గించి ఆసియా కొనుగోలుదారులకు షాక్ విత్ రిలీఫ్ ఇచ్చింది. ఈ కీలక పరిణామం వెనుక ఉన్న ప్రధాన కారణాలు, చమురు మార్కెట్‌‌పై దాని ప్రభావం, ఇతర ప్రాంతాల ధరల వ్యూహం అనేకం ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపార వర్గాలు నవంబర్ నెల ఆసియా సరఫరా కోసం ముడి చమురు ధర బ్యారెల్‌కు $3 వరకు పెరుగుతుందని ఆశించాయి. అయితే దానికి విరుద్ధంగా, సౌదీ అరామ్కో తన ప్రాథమిక "అరబ్ లైట్" గ్రేడ్ చమురు ధరను ఒమన్, దుబాయ్ బెంచ్ మార్క్ సగటు కంటే బ్యారెల్‌కు ఏకంగా $5 తక్కువ (డిస్కౌంట్)గా నిర్ణయించింది. జూన్ 2020 తర్వాత సౌదీ అరేబియా ఆసియా కొనుగోలుదారులకు అందించిన అతిపెద్ద రాయితీ (కోత) ఇది కావడం విశేషం. దీంతో పాటు "అరబ్ మీడియం", "అరబ్ హెవీ" వంటి ఇతర భారీ రకాల చమురు గ్రేడ్‌ల ధరలను కూడా బ్యారెల్‌కు మరో 5 డాలర్ల మేర తగ్గించింది.

Saudi Arabia Saudi Aramco Oil Prices Crude Oil Prices November Oil Prices Asia Oil Prices Saudi Oil Price Cut Arab Light Oil Price Cut Crude Oil Discount Six-Year Low 6-Year Low Asian Oil Buyers India Crude Oil India Oil Prices Oman Dubai Benchmark OPEC Strait of Hormuz Middle East Oil Global Oil Market Oil Price Outlook Petrol Prices Diesel Prices Saudi Aramco

ఈ అనూహ్య తగ్గుదలకు ప్రధాన కారణం ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి చేరిన రవాణా (షిప్పింగ్/ఫ్రైట్) ఛార్జీలే. అధిక రవాణా వ్యయం వల్ల ఆసియా రిఫైనరీలు చమురు కొనుగోళ్లను తగ్గించుకోకుండా చూడటానికి, అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి సౌదీ అరామ్కో కొనుగోలుదారులకు ఈ రాయితీని ఇచ్చింది. ముఖ్యంగా ఒమన్ నుండి రవాణా అయ్యే చమురుపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందించడాన్ని పరిశీలిస్తోంది.

Also Read

మరొకవైపు ప్రపంచ ముడి చమురు మార్కెట్ ఒత్తిడికి గురవుతుండటంతో సోమవారం అంతర్జాతీయంగా బెంచ్ మార్క్ చమురు ధరలలో పతనం నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.34 శాతం తగ్గి బ్యారెల్‌కు $101.90 కి చేరగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 62 సెంట్లు తగ్గడం ద్వారా బ్యారెల్‌కు $90.49 వద్ద ట్రేడ్ అవుతోంది. గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాలు తమ వద్ద ఉన్న అత్యవసర చమురు నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయడం, మధ్యప్రాచ్యం నుండి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడం సరఫరా ఆందోళనలను కొంతవరకు తగ్గించాయి.

అయితే ఆసియాకు భారీ డిస్కౌంట్ ఇచ్చి ప్రోత్సహించిన సౌదీ అరేబియా, వాయువ్య యూరప్, మధ్యధరా ప్రాంతాలకు మాత్రం నవంబర్ నెలకు చమురు అధికారిక విక్రయ ధరలను బ్యారెల్‌కు $3 చొప్పున పెంచింది. ఎర్ర సముద్రంలోని యాన్బు ఓడరేవు నుండి ఎగుమతులు పునఃప్రారంభం కావడంతో అక్కడ ధరల పెంపును వర్తింపజేసింది. కాగా అమెరికా కొనుగోలుదారులకు సరఫరా చేసే చమురు ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరంగా ఉంచింది.

ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన OPEC+ (పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి) సమావేశంలో సౌదీ అరేబియాతో సహా సభ్య దేశాలన్నీ నవంబర్ నెలకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను యథాతథంగా కొనసాగించేందుకు అంగీకరించాయి. వచ్చే ఏడాది వరకు ఉత్పత్తి కోతల్లో లేదా పరిమాణాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. రవాణా వ్యయాలు అధికంగా ఉన్నప్పటికీ, సౌదీ అరామ్కో ప్రకటించిన ఈ నిర్ణయం భారత్ తో సహా ఆసియాలోని ప్రధాన చమురు దిగుమతి దారులకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+