సౌదీ అరేబియా వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. అక్టోబర్ 17 వరకు విమానాలు రద్దు.. రద్దయిన విమానాల పూర్తి లిస్ట్ ఇదిగో.

Saudi flight cancellations: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలపై జరిపిన భీకర దాడులు మధ్యప్రాచ్య విమానయాన రంగంలో తీవ్ర కల్లోలాన్ని సృష్టించాయి. ముఖ్యంగా రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గ్లోబల్ ఎయిర్‌లైన్స్‌తో పాటు భారతీయ విమానయాన సంస్థలు కూడా తమ సర్వీసులను నిలిపివేశాయి.

సౌదీ గగనతలంలో నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాశ్ ఎయిర్ వంటి ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు సౌదీ అరేబియాలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగించే తమ విమాన సర్వీసులను అక్టోబర్ 17 వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించాయి.

Saudi flight cancellations Saudi Arabia flight update IndiGo cancelled flights Air India Saudi flights Akasa Air flight suspension Houthi attacks Saudi Arabia Riyadh airport closure Jeddah flight status Dammam flight cancellations Madinah flights Saudi travel advisory flight refund and rescheduling

గత వారం రియాద్ విమానాశ్రయంపై జరిగిన ఘోరమైన దాడిలో ఒక అమెరికన్‌తో సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామంతో సౌదీ అరేబియాలోని విమానయాన వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ భద్రతా సంక్షోభం కారణంగా ఇండిగో సంస్థ.. రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు నడిచే విమానాలను అక్టోబర్ 17 వరకు రద్దు చేసింది.

అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా రియాద్, దమ్మామ్, జెడ్డాలకు వెళ్లాల్సిన తమ సర్వీసులను నిలిపివేస్తూ, ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించాయి. అకాశ్ ఎయిర్ కూడా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రియాద్, జెడ్డాలకు అక్టోబర్ 17 వరకు విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.

Also Read

ఈ దాడుల ప్రభావం కేవలం భారతీయ సంస్థలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలపై తీవ్రంగా పడింది. యూఏఈ, ఖతార్, ఐరోపా దేశాలకు చెందిన ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఫ్లైదుబాయ్, ఎయిర్ అరేబియా, ఖతార్ ఎయిర్‌వేస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం సౌదీ గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను రద్దు చేశాయి లేదా పొడిగించాయి. విమానయాన విశ్లేషణ సంస్థ సిరియం గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 8 నుంచి 14 మధ్య సౌదీ విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సిన మొత్తం విమానాలలో దాదాపు 40 శాతం (సుమారు 3,100కి పైగా విమానాలు) రద్దయ్యాయి. ఎతిహాద్ ఎయిర్‌వేస్ అక్టోబర్ 19 వరకు రియాద్ విమానాలను రద్దు చేయగా.. ఫ్లైదుబాయ్ కూడా తన సౌదీ సర్వీసుల రద్దును అక్టోబర్ 19 వరకు పొడిగించింది.

అంతర్జాతీయ విమానయాన రంగంలోనూ ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్ఎం సంస్థ అక్టోబర్ నెలాఖరు వరకు, గల్ఫ్ ఎయిర్ అక్టోబర్ 17 వరకు, లుఫ్తాన్సా గ్రూప్ అక్టోబర్ 16 వరకు రియాద్ విమానాలను నిలిపివేశాయి. అలాగే మలేషియా ఎయిర్‌లైన్స్ జెడ్డా, మదీనా సర్వీసులను అక్టోబర్ 17 వరకు రద్దు చేయగా, ఫిలిప్పీన్ ఎయిర్‌లైన్స్ నవంబర్ 29 వరకు రియాద్ విమానాలను వాయిదా వేసింది. క్యాథే పసిఫిక్, డెల్టా ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు తమ సర్వీసుల పునఃప్రారంభాన్ని 2027 జనవరి, మార్చి నెలలకు వాయిదా వేసుకున్నాయి.

సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం.. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత అక్టోబర్ 17న 2100 GMT (అంటే అక్టోబర్ 18 అర్ధరాత్రి) వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భద్రతా ప్రమాణాలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే సర్వీసులను పునరుద్ధరిస్తామని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేశాయి. షెడ్యూల్డ్ సమయాల్లో విమానాలు కనిపిస్తున్నప్పటికీ అవి నడుస్తాయని హామీ లేనందున, ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు తమ సంబంధిత ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా విమాన స్థితిని తప్పనిసరిగా సరిచూసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+