సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో గత ఏడాది నికర లాభంలో 20.6 శాతం క్షీణతను నమోదు చేసింది. చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది. గత డిసెంబర్ నెలలో ఆరామ్‌కో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఆ తర్వాత ప్రకటించిన తొలి వార్షిక ఫలితాలు ఇవి.

భారీగా తగ్గిన లాభాలు
సౌదీ ఆరామ్‌కో లాభాలు 2018లో 111.2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. కానీ 2019లో ఇది 88.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. గత ఏడాది కంపెనీ రిఫైనింగ్, రసాయనాల మార్జిన్లు కూడా తగ్గాయి. అనుబంధ సంస్థ సదారా కెమికల్ కంపెనీ నష్టాలపై 1.6 బిలియన్ డాలర్లుకేటాయించడం కూడా ప్రభావం చూపింది. ఆరామ్‌కో మూలధన వ్యయాలు 35.1 బిలియన్ డాలర్ల నుండి 32.8 బిలియన్ డాలర్లకు తగ్గింది.

ఆరామ్ కో డివిడెండ్
2019 సౌదీ ఆరామ్‌కోకు చాలా ప్రత్యేకమైన సంవత్సరమని, ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని సీఈవో చెప్పారు. గత ఏడాది ప్రభావాలపై కరోనా వైరస్, సౌదీ - రష్యా ధరల యుద్ధం ప్రభావం పడలేదు. 2019 ఏడాదికి గాను ఆరామ్‌కో 73.2 బిలియన్ డాలర్ల డివిడెండ్ పంపిణీ చేయనుంది. ఐపీవో వల్ల ఈ ఏడాది నుండి రానున్న అయిదేళ్ల పాటు కనీసం 75 బిలియన్ డాలర్ల చొప్పున డివిడెండ్ చెల్లిస్తుంది.

డిఫికల్ట్ ఇయర్.. లాభాల్లో ఆరామ్‌కో
గత ఏడాది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని లాభాలు సాధించిన కంపెనీల్లో సౌదీ ఆరామ్‌కో ఉంది. 2020లో కేపిటల్ స్పెండింగ్స్ 25 బిలియన్ డాలర్ల నుండి 30 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications