రియాధ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధానికి సంబంధించిన దుష్ప్రభావం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఆరంభమైన దాడులు-ప్రతిదాడుల పర్వం 10వ రోజుకు చేరుకుంది. ఇప్పట్లో ఆగేలానూ లేదు. ఆంక్షల పరంపర కొనసాగుతున్నప్పటికీ..రష్యా ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. తన దాడి తీవ్రతను పెంచింది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై సంధించినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది.

లొంగని ఉక్రెయిన్..
అటు ఉక్రెయిన్ సైతం అంత సులభంగా లొంగట్లేదు. అమెరికా వంటి అగ్రరాజ్యం తనకు అండగా నిలవడం, యూరోపియన్ యూనియన్ దేశాల సహకారంతో రష్యాను ప్రతిఘటిస్తోంది. కీవ్‌ను కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది ఉక్రెయిన్ సైన్యం. ఛెర్నిహివ్, పోర్ట్ సిటీ ఒడెస్సా, బిలా సెర్క్వా, వొలిన్ ఒబ్లాస్ట్‌పై రష్యా వైమానిక బలగాలను అడ్డుకుంటోన్నాయి. మానవతా దృక్పథంతో రష్యా.. తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించింది.

తాత్కాలిక కాల్పుల విరమణ..
మరియోపొల్-4,40,000, వొల్నొవాఖాలో 21,000 మంది ప్రజలకు ఆహారం, మంచినీరు, మెడిసిన్ అందించడానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. యుద్ధం ఇప్పట్లో పూర్తిగా ఆగేలా కనిపించకపోవడం అటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి సైతం జోక్యం చేసుకున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. భద్రత మండలి నుంచి తొలగిస్తామంటూ హెచ్చరించినా పట్టించుకోట్లేదు.

క్రూడ్ రేట్లు ఆకాశానికి..
యుద్ధ ప్రభావం- ఊహించినట్టుగానే క్రూడాయిల్ ధరల అమాంతం పెరగడానికి కారణమైంది. బ్యారెల్ ఒక్కింటికి 120 డాలర్లను టచ్ చేసింది. దశాబ్దకాలం తరువాత ఈ స్థాయిలో ముడిచమురు రేటు పెరగడం ఇదే తొలిసారి. బ్రెంట్‌లో 2012లో బ్యారెల్ క్రూడాయిల్ ఒక్కింటికి 119 డాలర్లను తాకింది. ఆ తరువాత మళ్లీ ఈ స్థాయిలో వాటి రేటు పలకింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ క్రూడాయిల్ బ్యారెల్ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది గరిష్ఠానికి చేరింది.

సౌదీ అరేబియా కీలక నిర్ణయం..
దీని ప్రభావంతో సౌదీ అరేబియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆసియా దేశాలకు సరఫరా చేసే ముడిచమురు ధరను భారీగా పెంచింది. ఫలితంగా- ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రావడం దాదాపుగా ఖాయమైంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, రవాణా, షిప్పింగ్ సమస్యలు తలెత్తడం వల్ల వాటి రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆరామ్‌కో తెలిపింది. అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్ (ఓఎస్పీ) పెంచినట్లు పేర్కొంది.

బ్యారెల్‌పై..
బ్యారెల్ ఒక్కింటికి అరబ్ లైట్ క్రూడ్ ధర 4.95 డాలర్లకు పెంచింది. అమెరికా, వాయవ్య యూరోప్, మిడ్ టెర్రయిన్ రీజియన్లకు సౌదీ అరేబియా ముడిచమురును సరఫరా చేస్తోంది. ఇందులో సూపర్ లైట్, ఎక్స్‌ట్రా లైట్, లైట్, మీడియం, హెవీ రకాలుగా క్రూడ్‌ను విభజించింది. వాటన్నింటి రేట్లను కూడా సవరించినట్లు ఆరమ్‌కో తెలిపింది. ఒక్కో రకానికి.. ఒక్కో రేటును నిర్దేశించిందా సౌదీ అరేబియా స్టేట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications