Cricket: ప్రపంచస్థాయి T20 లీగ్ నిర్వహణకు సౌదీ కసరత్తు.. IPL ఫ్రాంచైజీలతో మంతనాలు ఫలించేనా..?
Cricket: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశంలో క్రికెట్ ప్రేమికులందరూ ఈ పండగ రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లక్షల కోట్ల రూపాయల మేర చేతులు మారుతూ ఉంటాయి. భారత్ లో ఈ ఆటకు ఇంతటి క్రేజ్ ఉంది కాబట్టే ప్రపంచంలోని అన్ని క్రికెట్ బోర్డుల కంటే రిచ్ గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) పేరు గడించింది.
BCCIకి గట్టి పోటీనిచ్చేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. IPL తరహాలో సొంతగా T20 లీగ్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అక్కడి ప్రభుత్వాధికారులు ఇప్పటికే దేశంలోని IPL జట్ల యజమానులతో సమావేశం సైతం నిర్వహించినట్లు ఆస్ట్రేలియాకు చెందిన ఓ మీడియా సంస్థ నివేదించింది. దీనికి తోడు సౌదీ అరేబియాను ప్రపంచ క్రికెట్ గమ్యస్థానంగా మార్చడం తమ లక్ష్యమని ఆ దేశ క్రికెట్ ఫెడరేషన్ ఛైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్-సౌద్ ఇటీల వ్యాఖ్యానించడమూ దీనికి బలం చేకూరుస్తోంది.

కానీ ఈ సమావేశానికి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. జరగబోయే లీగ్ లో భారత ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉందని మాత్రం ఆ మీడియా నివేదిక పేర్కొంది. అయితే IPL మినహా ఏ T20 లీగ్ లోనూ పాల్గొనేందుకు BCCI నిబంధనలు భారత ఆటగాళ్లను అనుమతించడం లేదు. ఏదైనా ఇతర లీగ్ లో ఆడాలంటే.. ఆ క్రికెటర్ BCCI నుంచి పూర్తిగా వైదొలగాల్సి ఉంటుంది.
పెట్టుబడుల పరంగా చూస్తే, ఇతర లీగ్ లలోనూ IPL జట్ల యజమానులకు ఫ్రాంచైజీలను ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే, ఫ్రాంచైజీలు ఇతర లీగ్ లలో ఇన్వెస్ట్ చేయకుండా BCCI అడ్డుకోలేదన్నమాట. కానీ భారత క్రికెట్ బోర్డు సహకారం లేకుండా, ఇండియా ప్లేయర్స్ ఆడకుండా.. సౌదీ అరేబియా ఈ ఈవెంట్ నిర్వహించడం దాదాపు అసాధ్యం. ఒకవేళ మొండిగా ముందుకెళ్లినా, అది భారత్ లోని IPL అంత హిట్ మాత్రం కాదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications