Gold Rate: శనివారం శాంతించిన గోల్డ్ రేటు.. ఏపీ-తెలంగాణ నేటి రేట్లివే..!
Gold Price Today: అంతర్జాతీయంగా పసిడి ధరలు జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా గోల్డ్ రేట్లు సైతం కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. దీంతో చాలా మంది వారాంతంలో షాపింగ్ చేయటానికి సిద్ధమౌతున్నారు. అయితే నేటి తాజా ధరలను ఇప్పుడు పరిశీలించిన తర్వాత గోల్డ్ కొనుగోలుకు వెళ్లటం మంచిది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు స్వల్పంగా రూ.100 పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తాజా గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7241, ముంబైలో రూ.7241, దిల్లీలో రూ.7256, కలకత్తాలో రూ.7241, బెంగళూరులో రూ.7241, కేరళలో రూ.7241, పూణేలో రూ.7241, వడోదరలో రూ.7246, జైపూరులో రూ.7256, మధురైలో రూ.7241, మంగళూరులో రూ.7241, నాశిక్ లో రూ.7244, అయోధ్యలో రూ.7256, బళ్లారిలో రూ.7280, గురుగ్రాములో రూ.7293, నోయిడాలో రూ.7293 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.100 పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తాజా గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7899, ముంబైలో రూ.7899, దిల్లీలో రూ.7914, కలకత్తాలో రూ.7899, బెంగళూరులో రూ.7899, కేరళలో రూ.7899, పూణేలో రూ.7899, వడోదరలో రూ.7904, జైపూరులో రూ.7914, మధురైలో రూ.7899, మంగళూరులో రూ.7899, నాశిక్ లో రూ.7902, అయోధ్యలో రూ.7914, బళ్లారిలో రూ.7942, గురుగ్రాములో రూ.7957, నోయిడాలో రూ.7957గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7241గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7899 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7241గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7899 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.500 పెరిగి నేడు రూ.1,07,000 వద్ద స్థిరంగా విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications