android: శాటిలైట్ ఫోన్స్ గురించి అందరూ వినే ఉంటారు. మనదేశంలో సాధారణంగా వీటిని సైనిక అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు. ఈ వ్యవస్థను పౌరులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ కంపెనీ అయితే ఏకంగా గతేడాది సేవలు సైతం ప్రారంభించింది కూడా. మనం రోజూ వినియోగించే మొబైల్స్ తో పోలిస్తే ఈ శాటిలైట్ ఫోన్స్ ఏ విధంగా ఉపయోగకరమో తెలుసుకుందాం..
సాధారణ మొబైల్ ఫోన్స్ ఉపయోగించాలి అంటే కచ్చితంగా నెట్వర్క్ కోసం సెల్ టవర్స్ ఉండాలి. మారుమూల ప్రాంతాల్లో వీటి ద్వారా నెట్వర్క్ అందించడం కుదరదు. ఒకవేళ సిగ్నల్స్ అందించగలిగినా అనుకున్న స్థాయిలో ఇంటర్నెట్ వినియోగానికి అవకాశం ఉండదు. అదే శాటిలైట్ ఫోన్స్ వినియోగానికి టవర్స్ అవసరం ఉండదు. అంతరిక్షంలోని ఉపగ్రహాల ద్వారా సిగ్నల్స్ ట్రాన్స్మిషన్ జరగడం వల్ల ఇతరులతో తేలికగా కమ్యూనికేట్ చేయవచ్చు.

ఒకవేళ ఇదే టెక్నాలజీని స్మార్ట్ ఫోన్స్ కు అనుసంధానం చేస్తే.. యాంటెన్నాలు, సెల్ టవర్ల అవసరం లేకుండానే కమ్యూనికేషన్ జరపవచ్చు. ఈ దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. హువాయి కంపెనీ గతేడాది సెప్టెంబర్ 6న స్మార్ట్ ఫోన్ లో శాటిలైట్ కనెక్టివిటీని ప్రవేశపెట్టింది. రెండు రోజుల అనంతరం ఐఫోన్ 14 సిరీస్ లో ఎమర్జెన్సీ SOSకు సైతం ఈ కొత్త టెక్నాలజీ అనుసంధానించబడింది.
ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు తక్కువ ఎత్తులో ఉన్న ఉపగ్రహానికి కనెక్ట్ అయ్యి ఎమర్జెన్సీ సందేశాలు పంపడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఆపిల్ ఫోన్స్ తో దీనిని జోడించగా.. త్వరలోనే ఆండ్రాయిడ్ 14కి ఇంటిగ్రేట్ చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ సైతం రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల హవాయిలో కార్చిచ్చు ఏర్పడటంతో ఓ కుటుంబం ఆ మంటల్లో చిక్కుకుపోయింది. అప్పుడు ఈ సాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారానే వారు బయటపడగలిగారు. ఏదైనా మారుమూలకు ప్రాంతాలకు వెళ్లాల్సినప్పుడు బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా సిల్సిగ్నల్స్ లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలోనే ఇది అండ్రాయిడ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications