Ambani Vs Musk: ప్రధాని ఆఫీసుకు పంచాయతీ.. నువ్వా నేనా అంటున్న అంబానీ, ఎలాన్ మస్క్
Ambani Vs Musk: ప్రస్తుతం పరిస్థితి ఇండియన్ బిలియనీర్ వర్సెస్ అమెరికన్ బిలియనీర్ అన్నట్లుగా మారిపోయింది. ఇద్దరి మధ్య ఇప్పుడు వ్యాపార యుద్ధం తారాస్థాయిలకు చేరుకుంది.
ప్రస్తుతం భారత టెలికాం రంగాన్ని శాశిస్తున్న జియో అధినేత అంబానీకి ఎలాన్ మస్క్ చర్యలు అస్సలు మింగుడు పడనివ్వటం లేదు. శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీల మధ్య జరుగుతున్న యుద్ధం భారత ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకునే స్థాయికి చేరుకుంది. అక్కడ అసలు గొడవంతా స్పెక్ట్రమ్ కేటాయింపు పద్ధతిపైనే.

శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలం ద్వారా సర్వీస్ ప్రొవైడర్లకు కేటాయించాలని రిలయన్స్ జియో అధినేత అంబానీ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మస్క్ తో పాటు ఇతర ఆటగాళ్లు అంబానీ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఈ సమస్యపై PMO వైఖరి కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడైంది. మస్క్ SpaceX, ఎయిర్ టెల్ మిట్టల్ OneWebతో పాటు కెనడియన్ కంపెనీ Telesatతో కలిసి రెండేళ్లుగా దేశంలో అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నాయి.
శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలా లేక పరిపాలనాపరంగా కేటాయించాలా అనే దానిపై కొనసాగుతున్న చర్చల కారణంగా కంపెనీల ప్రణాళికలు ఆలస్యం అయ్యాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రకారం అంతర్జాతీయ ప్రమాణం అడ్మినిస్ట్రేటివ్ అసైన్‌మెంట్‌కు మద్దతు ఇస్తుంది. కానీ భారత్ లో మాత్రమే దీనికి భిన్నంగా అంబానీ సంస్థ వాదన వినిపిస్తోంది. మస్క్ అనుకున్నట్లుగా జరిగితే అది జియో టెలికాంకు అతిపెద్ద వ్యాపార దెబ్బ తగిలిస్తుందని అంబానీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ ట్రెండ్‌లకు అనుగుణంగా స్పెక్ట్రమ్‌కు లైసెన్స్ ఇవ్వడాన్ని స్పెస్ ఎక్స్ ఇష్టపడుతోంది. ఎందుకంటే ఇది ఎంటర్‌ప్రైజెస్ భాగస్వామ్యం చేయవలసిన సహజ వనరు. పైగా ఈ సర్వీసులు భారీగా ఖర్చుతో కూడుకున్నవి. విదేశీ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు వాయిస్ మరియు డేటా సేవలను అందిస్తూ.. రానున్న కాలంలో టెలికాం ఎంటర్‌ప్రైజెస్‌తో పోటీ పడవచ్చు. ఇది భారతీయ టెలికాం రంగంలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications