IPO News: పండుగ దగ్గర పడుతున్న కొద్ది ఐపీవోలు వేగంగా మార్కెట్లో లిస్టింగ్ జరుగుతున్నాయి. అయితే ఇవి ఇన్వెస్టర్లకు లాభాలను అందించటంలో ఒకదానితో మరొకరి పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎస్ఏఆర్ టెలివెంటర్స్(SAR Televenture) స్టాక్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను తొలిరోజే అందించి తన సత్తాచాటుకుంది. వాస్తవంగా కంపెనీ ఇష్యూ ధర కంటే 91 శాతం ప్రీమియం రేటు అయిన రూ.105 వద్ద ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో స్టాక్ అరంగేంట్రం చేసింది. వాస్తవానికి కంపెనీ తన షేర్ ధరను ఐపీవో సబ్ స్క్రిప్షన్ కోసం రూ.55గా నిర్ణయించింది. అయితే లిస్టింగ్ ముందు సైతం కంపెనీ షేర్ ధర 96 శాతం గ్రేమార్కెట్ ప్రీమియం కలిగి ఉంది.

గ్రేమార్కెట్ అంచనాలకు అత్యంత దగ్గరగా బలమైన ప్రవేశాన్ని ఎస్ఏఆర్ టెలివెంటర్స్ నమోదు చేసింది. దీంతో ఐపీవోలో షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సంపద అమాంతం రెండింతలైంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.24.75 కోట్లను సమీకరించింది. నవంబర్ 1న రిటైల్ ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం తెరచుకున్న ఐపీవో నవంబర్ 3న ముగిసింది. దీనికోసం కంపెనీ ప్రైస్ బ్యాంక్ రూ.52-55గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి SAR టెలివెంచర్ ఇష్యూ 267 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. ఇష్యూ సైజు 32.28 లక్షల షేర్లు మాత్రమే ఉన్నప్పటికీ.. ఇన్వెస్టర్ల నుంచి 86.38 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 715 సార్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 222 సార్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాల కంటే 77 రెట్లు దరఖాస్తులను అందుకుంది. తాజాగా సమీకరించిన సొమ్మును కంపెనీ 5G/4G టవర్‌ల ఇన్‌స్టాలేషన్ కోసం ఉపయోగించనుంది. అలాగే రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని చూస్తోంది.
కంపెనీ టెలికాం నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు టెలికమ్యూనికేషన్ పరిష్కారాలను అందిస్తుంది. దీనికోసం 4G, 5G టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్(OFC) సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. అలాగే నెట్‌వర్క్ పరికరాల్లో డీల్ చేస్తుంది.


Click it and Unblock the Notifications