ప్రతి ఏటా డిసెంబర్ 25 వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఆశగా ఎదురుచూసే పేరు 'సాంటా క్లాజ్' (Santa Claus). ఎర్రటి డ్రస్సు, తెల్లటి గడ్డం, వీపున ఒక పెద్ద గిఫ్టుల మూటతో కనిపించే శాంటా.. అదే క్రిస్మస్ తాత. ఆయన అంటే అందరికీ ఇష్టమే. అయితే ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? ప్రపంచంలోని కోట్లాది మంది పిల్లలకు ప్రతి ఏటా ఖరీదైన గిఫ్టులు ఇచ్చే శాంటా ఆస్తి ఎంత ఉంటుంది? ఆయన ఒక బిలియనీరా? లేక అంతకంటే ఎక్కువా? దీనిపై ఆర్థిక నిపుణులు కొన్ని ఆసక్తికరమైన లెక్కలు వేశారు.

ఫోర్బ్స్ (Forbes) దృష్టిలో శాంటా ఆస్తి ఎంత?
ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఒకప్పుడు 'ఫిక్షనల్ 15' (కల్పిత పాత్రల ధనవంతులు) జాబితాను విడుదల చేసేది. అందులో శాంటా క్లాజ్ స్థానం ఎప్పుడూ మొదటిదే. ఆయన ఆస్తిని ఫోర్బ్స్ ఏమని పేర్కొనేదో తెలుసా? 'అనంతం' (Infinity). అవును, సుమారు 1,600 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆనందాన్ని పంచుతున్న శాంటా సంపదను లెక్కించడం అసాధ్యమని వారి అభిప్రాయం.
శాంటా ఎందుకు ఇంత ధనవంతుడు?
శాంటా సంపద కేవలం డబ్బు రూపంలో ఉండదు. ఆయన వద్ద ఉన్న ఆస్తులను ఒకసారి గమనిస్తే..
- నార్త్ పోల్ హెడ్ క్వార్టర్స్: మంచు ఖండంలో ఆయనకున్న వర్క్‌షాప్, ఎల్ఫ్ (Elves) నివాసాలు, రెయిన్ డీర్ల స్థావరాల విలువ కొన్ని వందల కోట్ల డాలర్లు ఉంటుంది.
- బ్రాండ్ వాల్యూ: ప్రపంచంలో శాంటా క్లాజ్ బొమ్మ లేని షాపు ఉండదు. ఆయన ఫోటోతో జరిగే వ్యాపారం కొన్ని వేల కోట్లు.
- జీరో డెట్ (అప్పులు లేవు): శాంటాకు ఎటువంటి అప్పులు లేవు, పైగా ఆయన ఇచ్చే ప్రొడక్ట్ (గిఫ్టులు) అన్నీ ఉచితం. ఇలాంటి బ్రాండ్ ఈక్విటీ మరెవరికీ సాధ్యం కాదు.
ఆర్థిక నిపుణుల అంచనా: రూ. 4 లక్షల కోట్లు!
కొంతమంది ఆర్థిక విశ్లేషకులు శాంటా ఆస్తిని ప్రస్తుత మార్కెట్ విలువతో లెక్కగట్టారు. కొందరు నిపుణుల ప్రకారం శాంటా నికర ఆస్తి తక్కువలో తక్కువ 2 నుండి 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 40,000 కోట్లు) ఉంటుందట. మరికొందరు విశ్లేషకులు ఆయన గిఫ్టులు పంపిణీ చేసే ఖర్చు, రెయిన్ డీర్ల విలువ, ఆయన వద్ద పనిచేసే వేలాది మంది 'ఎల్ఫ్స్' జీతాలను లెక్కేస్తే.. అది దాదాపు 51 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) పైమాటే అని చెబుతున్నారు.
డబ్బుతో తూచలేని ఆస్తి!
శాంటా క్లాజ్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అదొక నమ్మకం. ఆయన ఇచ్చే గిఫ్టుల విలువ కంటే అవి ఇచ్చేటప్పుడు పిల్లల ముఖాల్లో కనిపించే చిరునవ్వు విలువ ఎంతో పెద్దది. ప్రపంచంలో ఏ బిలియనీర్ కూడా అంతటి ఆనందాన్ని కొనుగోలు చేయలేరు. అందుకే శాంటా ఈ భూమి మీద అందరికంటే ధనవంతుడు.


Click it and Unblock the Notifications