Sandeep Tandon: దేశంలో క్వాంట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ స్కీమ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టిన 75 లక్షల మందికి సీఈవో సందీప్ టాండన్ హామీ ఇచ్చారు. కంపెనీపై ఫ్రంట్ రన్నింగ్ అనుమానాల దృష్ట్యా సెబీ దర్యాప్తు కొనసాగటం పెద్ద ప్రకంపనలకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థాపకుడు, CIO సందీప్ టాండన్ ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ విచారణ గురించి ఎటువంటి వివరాలను ఇవ్వలేదు. అకస్మాత్తుగా సెబీ చర్యల తర్వాత చాలా మంది ఫండ్ హౌస్ నుంచి వెనక్కి తీసుకుంటున్న వేళ లిక్విడిటీ స్థాయి, రిస్క్‌ని నిర్వహించగల సామర్థ్యం గురించి పెట్టుబడిదారులు, వాటాదారులకు హామీ ఇచ్చారు. జూన్ 26న జూమ్ కాల్ ద్వారా టాండన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన మీడియా కవరేజ్ తనకు బాధ కలిగించిందన్నారు. ముఖ్యంగా 4 ఏళ్ల కిందట మరణించిన తన తండ్రి గురించి ప్రస్తావించటంపై విచారం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఫండ్ హౌస్ డేటా, అనలిటిక్స్‌పై ఆధారపడటంలో స్థిరంగా ఉంటుందని టాండన్ వెల్లడించారు. గడచిన కొన్ని నెలలుగా కంపెనీ మిడ్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్, లిక్విడిటీ తక్కువగా ఉండే ఆస్తుల నుంచి హై లిక్విడిటీ ఆస్తులకు పెట్టుబడులను మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఫండ్ హౌస్ దాదాపు రూ.47,640 కోట్లు విలువైన లిక్విడ్ పెట్టుబడులను లార్జ్ క్యాప్ స్టాక్స్, టి బిల్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, బంగారం, వెండి వంటి వాటివి ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆందోళనలో ఉన్న ఇన్వెస్టర్లు గడచిన మూడు రోజులుగా క్వాంట్ ఫండ్స్ నుంచి దాదాపు రూ.1,398 కోట్లను విత్ డ్రా చేసుకున్నట్లు తెలిపారు. ఇవి కంపెనీ నిర్వహిస్తున్న మెుత్తం ఆస్తుల్లో 1.5 శాతానికి సమానమైనవిగా వెల్లడించారు.
పెట్టుబడిదారులు డబ్బును ఉపసంహరించుకోవటంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన ధోరణి గత మూడు రోజులుగా కనిపించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో తమ ఫండ్ హౌస్ పూర్తిగా డేటా, అనలిటిక్స్ పై ఆధాపడి ఉంటుందంటూనే డేటా తమకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. డేటాను విశ్వసించే ఈ విధానం ఫండ్ హౌస్‌కి ఎలా ప్రయోజనం చేకూర్చిందో వివరిస్తూ.. 2024లో తాము నిఫ్టీ సూచీ 24,000 స్థాయికి చేరుకుంచుంటుందని అంచనా వేశామని ప్రస్తుతం ఇది లక్ష్యానికి దగ్గరలోనే ఉందని తెలిపారు. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయంలో అంచనా నిజమై 54000 స్థాయిని దాటిన విషయం గుర్తుచేశారు. ప్రస్తుతం ఇండియా టైమ్ నడుస్తోందన్న టాండన్ ఇన్వెస్టర్లు భయంతో పెట్టుబడులు మానొద్దని సూచించారు.


Click it and Unblock the Notifications