భారతదేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గింది. కొత్తగా అమ్మే ప్రతి మొబైల్ ఫోన్‌లో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) ను తప్పనిసరిగా ముందుగానే (Pre-install) ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గత రెండు రోజులుగా సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app)పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఈ యాప్ ప్రతిఫోన్ లో ముందుగానే ఇన్ స్టాల్ చేయాలని రూల్ పెట్టడంతో వ్యక్తిగత గోప్యత (Privacy), ప్రభుత్వ నిఘాకు సంబంధించిన ఆందోళనలు తీవ్రం అయ్యాయి. మొబైల్ తయారీదారులు, యూజర్ల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
జరిగింది ఇదే..
మొబైల్ తయారీ కంపెనీలతో పాటు, టెక్ నిపుణులు, విపక్షాలు ఈ నిర్ణయంపై వ్యతిరేకంగా ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో ఒక యాప్‌ను తప్పనిసరి చేయడం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని, ప్రభుత్వం తమపై నిఘా పెడుతుందని (Snooping) నిపుణులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. దేశ పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించడానికే, కేంద్రం ఈ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను తప్పనిసరి చేస్తోందని వారు ఆరోపించారు. ఈ విమర్శల కారణంగా, ఈ సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) వివాదాస్పదంగా మారింది. అయితే ఈ విమర్శలు, ఆందోళనలు తీవ్రం కావడంతో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మొబైల్ తయారీ కంపెనీలు తమ ఫోన్లలో ఈ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి ఇచ్చిన స్పష్టత
విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలోనే ఈ యాప్ గురించి వివరణ ఇచ్చారు. సంచార్ సాథీ యాప్ ను యాక్టివేట్ చేసుకోవడం అనేది కేవలం ఆప్షనల్ (Optional) మాత్రమేనని, ఇది ఏ మాత్రం తప్పనిసరి కాదని ఆయన గతంలోనే ప్రకటించారు. ఈ యాప్‌ను ఎవరైనా తమ ఫోన్ నుంచి సులభంగా తొలగించుకోవచ్చని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా ఎటువంటి నిఘా పెట్టడం కాని, కాల్స్ మానిటర్ చేయడం కాని జరగదని, ఇది కేవలం సైబర్ సెక్యూరిటీ (Cyber Security) ప్రయోజనాల కోసం, ప్రజల రక్షణ కోసమే తయారు చేయబడిందని ఆయన వెల్లడించారు.
గతంలో ఇలా..
కొత్తగా వచ్చే ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని కేంద్రం నవంబర్ 28న ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే చర్య అని విపక్షాలు ఆందోళన చేయడంతో.. ఇది ఆప్షనల్ అని, యూజర్లు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.ఈ యాప్ ద్వారా ఇప్పటివరకూ 2.75 కోట్ల మోసపూరిత మొబైల్ కనెక్షన్లను తొలగించామని, చోరీకి గురైన 20 లక్షల ఫోన్ల లొకేషన్‌ను గుర్తించి అందులో 7.5 లక్షల ఫోన్లను తిరిగి అందజేశామని తెలిపారు. అయితే ప్రజల భయాందోళనల దృష్ట్యా, కేంద్రం చివరికి తప్పనిసరి అనే నిబంధన నుంచి వెనక్కి తగ్గింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications