దీపావళి రోజున సంవత్ 2078లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన మూరత్ ప్రత్యేక ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అదరగొట్టాయి. గంటసేపు జరిగిన ఈ ట్రేడింగ్‌ను బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురువారం సాయంత్రం 6.15 గంటలకు గంటకొట్టి ప్రారంభించారు. ట్రేడింగ్ ప్రారంభం నుండి సూచీలు లాభాల్లో కొనసాగాయి. ఓదశలో దాదాపు 400 పాయింట్ల లాభంలోకి దూసుకెళ్లిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరికి 295.70 పాయింట్లు లాభపడి 60,067 వద్ద ముగిసింది. నిఫ్టీ 87.60 పాయింట్లు లాభంతో 17,916 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 60,207.97 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,207.97 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,011.46 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 295.70 (0.49%) పాయింట్లు లాభపడి 60,067.62 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.49 పాయింట్లు లాభపడి 17,916.80 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 62,245.43, అలాగే 52 వారాల కనిష్టం 40,076.47. నిఫ్టీ 52 వారాల గరిష్టం 18,604.45 పాయింట్లు, 52 వారాల కనిష్టం 12,131.85.

నిఫ్టీలో ఐచర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ లిమిటెడ్, బజాజ్ ఆటో లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ముగియగా, హిండాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఆటో, PSU బ్యాంక్ షేర్లు 1 శాతం పైన లాభపడగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో అన్ని రంగాలు విలవిల..ఎంతలా అంటే..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications