Penny Multibgger: స్టాక్ మార్కెట్లలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వేటాదేడి తక్కువ రేటులో అందుబాటులో ఉండే మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కోసమే. అయితే వేల సంఖ్యలో ఉన్న లిస్టెడ్ కంపెనీల జాబితాలో వాటిని గుర్తించటం కొంత కష్టమే. అయితే మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లు తలరాత మార్చేస్తాయని ఈ కంపెనీ దీర్ఘకాలంలో నిరూపించి చూపించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు స్టాక్ భారీ లాభాలను అందించింది. సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్లు దీర్ఘకాలికంగా 138,900% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.111.20గా ఉంది. బ్రోకరేజ్ ప్రతినిధులు ప్రస్తుతం కంపెనీ షేర్లపై బులిష్ వ్యూ కలిగి ఉన్నారు. రానున్న కాలంలో కంపెనీ షేర్ల ధర మరింతగా పెరుగుతుందని వారు చెబుతున్నారు.

షేర్ల గతాన్ని పరిశీలిస్తే దశాబ్ధకాలం కిందట 1999లో సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్ల ధర ఒక్కోటి 1 పైస కంటే తక్కువగా 0.080 పైసలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఒక్కో షేరు రేటు రూ.111.20గా ఉంది. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుంది. అలాగే గడచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే కంపెనీ షేర్ల ధర 64.01% ర్యాలీని నమోదు చేసింది.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉంది. ఇన్వెస్టర్లకు కొనుగోలు చేయాలని సలహా ఇస్తోంది. ఇందుకోసం టార్గెట్ ధర ఒక్కో షేరుకు రూ.150గా ప్రకటిస్తూ 'బై' కాల్ ఇచ్చింది. 31-12-2023తో ముగిసిన త్రైమాసికానికి ఏకీకృత మొత్తం ఆదాయం రూ.25,752.26 కోట్లుగా కంపెనీ నివేదించింది. ఇటీవలి త్రైమాసికములో పన్ను తరువాత నికర లాభాన్ని రూ.569.20 కోట్లుగా కంపెనీ నివేదిక అందజేసింది. ఏడాది జనవరి 1 నాటికి కంపెనీలో ప్రమోటర్లకు 64.78 శాతం వాటా ఉండగా, FIIలకు 10.78 శాతం, DIIలకు 15.27 శాతం వాటా హోల్డ్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications