స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా వెలుగుతున్న శాంసంగ్.. తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఎస్ 26 (Samsung S26) లాంచ్‌కు సర్వం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2026లో ఈ సిరీస్ గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుందని సమాచారం. అయితే లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల ధరలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. మునుపటి మోడల్స్ కంటే ఈసారి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ ఎస్26 సిరీస్: ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
మొబైల్ మార్కెట్ లో శాంసంగ్ కు ఓ ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. అటు బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇటు ప్రీమియం ఫ్లాగ్‌షిప్.. రెండు సెగ్మెంట్లలోనూ శాసంగ్ రాణిస్తూ వస్తోంది. అయితే ప్రీమియం మొబైళ్ల ధరలు ఇప్పుడు మరింత ప్రీమియంగా మారడం టెక్ ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన నివేదికల ప్రకారం.. శాంసంగ్ తన హోమ్ మార్కెట్‌లో ధరలను పెంచే యోచనలో ఉంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి..
1. మెమరీ ధరలు పెరగడం: గత ఏడాది కాలంగా స్మార్ట్‌ఫోన్లలో వాడే RAM (12GB LPDDR5X) ధర రెట్టింపు అయింది. అలాగే స్టోరేజ్ (NAND Flash) ఖర్చులు కూడా పెరిగాయి.
2. చిప్‌సెట్ ఖర్చు: శాంసంగ్ క్వాల్కమ్ (Snapdragon) చిప్‌సెట్ల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. డాలర్ విలువ పెరగడం కూడా ఈ భారాన్ని మరింత పెంచింది.
ఇండియాలో ధర ఎంత ఉండొచ్చు?
భారత మార్కెట్లో శాంసంగ్ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ధరల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో ఎస్25 సిరీస్ ధరలను బట్టి చూస్తే.. ఈసారి Samsung S26 సిరీస్ అంచనా ధరలు ఇలా ఉండవచ్చు..
- Samsung Galaxy S26: సుమారు రూ. 81,999 నుంచి ప్రారంభం కావచ్చు.
- Samsung Galaxy S26 Plus: సుమారు రూ. 1,00,000 పైమాటే అనిపిస్తోంది.
- Samsung Galaxy S26 Ultra: దీని ధర రూ. 1,35,000 దాటే అవకాశం ఉంది.
గతేడాది గెలాక్సీ ఎస్25 అల్ట్రా రూ. 1,29,999 వద్ద లాంచ్ అయింది. ఈసారి రాబోయే అల్ట్రా మోడల్‌లో భారీ మార్పులు ఉండటమే ధర పెంపునకు ప్రధాన కారణం కానుంది.
Samsung S26 Ultra ఉండే స్పెషల్ ఫీచర్లు..
లీక్ అయిన సమాచారం ప్రకారం.. అల్ట్రా మోడల్ ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా రాబోతోంది: కొత్త కోటింగ్స్‌తో మెరుగైన లెన్స్‌లు, వైడర్ సెల్ఫీ కెమెరా, మెరుగైన జూమ్ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. అలాగే మరింత సమర్థవంతమైన డిస్ ప్లే ప్రైవసీ స్క్రీన్ ఫీచర్ ఉండనుంది. గతంలో కంటే ఈ ఫోన్ మరింత స్లిమ్‌గా (Slim Design) ఉండబోతోంది. వీటితోపాటు ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.
ఐఫోన్ 17కి గట్టి పోటీ!
సాధారణంగా శాంసంగ్ తన ధరలను యాపిల్ ప్రో మోడల్స్ కంటే తక్కువగానే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. రాబోయే ఐఫోన్ 17 ప్రో (iPhone 17Pro) సిరీస్ ధరల కంటే Samsung S26 ధరలు కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 25, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే ఈవెంట్‌లో ఈ ఫోన్లు అధికారికంగా విడుదల కానున్నాయి. మరి శాంసంగ్ ఈ పెరిగిన ధరలను వినియోగదారులపై వేస్తుందా? లేక ఆఫర్లతో సర్దుబాటు చేస్తుందా? అన్నది వేచి చూడాలి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications