ముంబైలోని 19 ఏళ్ల విద్యార్థిని "సమృధి ఎలాంతోలి" తన ఇంటి వంట గదిలోనే బేకింగ్ ద్వారా సక్సెస్ సృష్టించింది. 2024లో ఆమె ప్రారంభించిన "లా జోయి" హోమ్ బేకరీలో బొంబాయిలోని, బిస్కెట్స్, టీ కేక్స్, బ్రౌనీస్ లాంటి డెసర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మొదట సమృధి తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చిన్నపాటి బేకింగ్ చేస్తూ ప్రారంభించింది. కానీ త్వరలోనే తన హాబీని వాస్తవ బిజినెస్‌గా మార్చొచ్చని గుర్తించింది.
సమృధి పెద్ద మార్కెటింగ్ ఖర్చు లేకుండా కూడా తన వ్యాపారాన్ని పెంచింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్లో డెసర్ట్స్ తయారీ చేస్తు చూపించడం మొదలుపెట్టింది. ఆమె వీడియోలు చూసినవారిని బాగా ఆకట్టుకున్నాయి. ఆర్డర్స్ స్వతహాగా రావడం మొదలయ్యాయి. ఆరు నెలల్లోనే ఆమె రూ. 4 లక్షల సేల్స్ సంపాదించింది.

సమృధి కుటుంబం కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా ఆమె తల్లి దగ్గర బేకింగ్ చేసేందుకు అవసరమైన అన్ని టూల్స్ ఉన్నాయి. వాటిని సమృధి ఉపయోగించి, డెసర్ట్స్ తయారు చేసి ఆర్డర్స్ రెడీ చేస్తుంది. వ్యాపారం ద్వారా వచ్చిన ప్రతి రూపాయి, అదనంగా ఖర్చు చేయకుండా తిరిగి వ్యాపార అభివృద్ధికి పెట్టింది. ఇలా చెల్లించడానికి ఉపయోగించిన ప్రతి రూపాయి వ్యాపారంలో పెట్టడం ద్వారా, లా జోయి స్థిరమైన గ్రోత్ సాధించింది.
2024 చివరి వరకు సమృధి లా జోయి ద్వారా 450 కంటే ఎక్కువ కస్టమర్లకు తన డెసర్ట్స్ అందించింది. సమీప ప్రాంతంలో కూడా లా జోయి కు మంచి పేరు ఏర్పడింది. కస్టమర్లు నాణ్యత, రుచులు, సర్వీస్ అన్ని మెచ్చుకొని మళ్ళీ ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దీని వల్ల చిన్న హోమ్ బేకరీగా ప్రారంభించిన లా జోయి, తన పరిధిలో గొప్ప గుర్తింపు సాధించింది.
కానీ ఈ ప్రయాణం ఎప్పుడూ సులభం కాలేదు. కొన్నిసార్లు డెలివరీ ఖర్చు డెసర్ట్ ధర కంటే ఎక్కువ అయ్యేది. లాజిస్టిక్ సమస్యలు, షెల్ఫ్-లైఫ్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ సమృధి వెనక్కి తగ్గలేదు. నేర్చుకుంది, అడాప్ట్ అయ్యి కంటెంట్‌ను పెంచుతూ వచ్చింది. లా డిగ్రీ చదువుతూనే సమృధి కాలేజ్ మరియు బేకింగ్‌ను సవ్యంగా నిర్వహిస్తుంది. ఉదయం లేచి బేక్ చేస్తుంది, ప్యాకింగ్ చేస్తుంది, ఆర్డర్స్ హ్యాండిల్ చేస్తుంది, తరవాత తరగతులకు హాజరవుతుంది.
సమృధి కథ మనకి ప్యాషన్ + గట్టిపట్టు+ సోషల్ మీడియా స్మార్ట్ ఉపయోగం ద్వారా చిన్న ఆలోచనను నిజమైన బిజినెస్‌గా మార్చవచ్చని తెలియజేస్తుంది. ఇది చదువుతున్న యువతకు కూడా ప్రేరణ. చదువుతున్నప్పటికీ తన స్వంత వ్యాపారం మొదలుపెట్టవచ్చా? అనే సందేహం ఉన్న వారందరినీ ప్రేరేపిస్తోంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications