ఏపీలో 10 గంటల పని.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక చట్టం మారబోతోంది. దీని ప్రకారం.. ఇకపై కార్మికులు రోజుకు 10 గంటలు పనిచేయాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెంచడానికి రోజులో గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచాలని.. కార్మికులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా కార్మిక చట్టాలను సవరించాలని నిర్ణయించినట్లు ఐ అండ్ పిఆర్ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లేబర్‌ కోడ్‌ 2020కు అనుగుణంగా పలు కార్మిక చట్టాలకు సవరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.

అయితే దీనిపై ప్రతిపక్షాలతో పాటు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ.. కార్మిక చట్టాల్లో ఇప్పుడు చేసే మార్పులు కార్మికులకు తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయని..ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో అమలు చేయబడుతున్నాయని ఆరోపించారు.కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. గత 11 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం భారతదేశంలో కార్మికుల హక్కులను ఉల్లంఘించే చర్యలను పదే పదే తీసుకుంటోందని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Andhra Pradesh work law 10-hour workday India AP labor law longer work hours employee rights India Andhra workers protest Indian labor laws working conditions AP work policy backlash social media outrage India same pay long hours 10 CM Chandrababu 10 10 10 2020 2020

ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. AP ప్రభుత్వం..ప్రైవేట్ సంస్థలకు రోజువారీ పని గంటలను 10కి పెంచుతుంది? ఇది వ్యాపారం చేయడంలో సౌలభ్యమా లేదా శ్రమను దోపిడీ చేయడంలో సౌలభ్యమా.. ఏదేమైనా బలయ్యేది కార్మికులే. మీరు దీనితో ఏకీభవిస్తారా? అంటూ ప్రశ్నించారు. మరో యూజర్ ట్వీట్ చేస్తూ.. చాలా దేశాలలో సాయంత్రం 4 గంటలకు మిమ్మల్ని లాగ్ అవుట్ చేయమని అడుగుతారు. మన దేశంలో మాత్రం కనీసం 10 గంటలు పని చేయించేలా కార్మిక చట్టాలను సవరిస్తున్నారు..అయితే కంపెనీలు మాత్రం జీతాలను అరకొరా చెల్లిస్తున్నాయని తెలిపారు.

మరొక వినియోగదారు మాట్లాడుతూ..తొమ్మిది గంటల పని దినమే చాలా ఎక్కువ..మీరు దీన్ని 10 గంటలు చేశారు.. ఉద్యోగులతో ఎక్కువగా పనిచేయించుకుంటే చాలా సమస్యలు వస్తాయి. వారి కుటుంబాలతో గడిపే సమయం ఉండదు.. ఏపీలో ఇప్పటికే సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతోంది. మీరు పిల్లలను కనకుండా ప్రజలను ప్రోత్సాహిస్తున్నట్లుగా మీ నిర్ణయాలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ పని గంటలు అంటే మెరుగైన ఉత్పాదకత అని భావిస్తోంది..అయితే ఇది శ్రమ దోపిడీ. ఎక్కువ గంటలు పనిచేసినా అదే జీతం. కార్మికులవి అధ్వాన్నమైన జీవితాలు. కార్మికులు గౌరవానికి అర్హులు కాని ఇలా మాడిపోవడానికి కాదని మరొక నెటిజన్ స్పందించారు.

మొత్తం మీద చాలామంది నెటిజన్లు ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు.. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా మారాయని ఆరోపించారు. కార్మికుల శ్రమ దోపిడిని వారు ఆదాయంగా మార్చుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త నిరసనను ప్రకటించాయి. అన్ని రంగాల కార్మికులు ఈ నిరసనలో పాల్గొననున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కాగా ఐ అండ్ పిఆర్ మంత్రి కె. పార్థసారథి రోజుకు 9 గంటలు గరిష్టంగా పని చేసే సమయాన్ని ఇప్పుడు 10 గంటలకు పెంచుతున్నట్లు తెలిపారు. రోజుకు గరిష్టంగా 10 గంటల పని చేయోచ్చనే విధంగా కార్మిక చట్టాలను తయారు చేశారు. లేబర్ యాక్ట్‌లోని.. సెక్షన్ 55 ప్రకారం 5 గంటల పనికి ఒక గంట విశ్రాంతి ఉండేది. దానిని ఇప్పుడు ఆరు గంటలకు మార్చారని తెలిపారు. ఓవర్ టైం 75 గంటల వరకు మాత్రమే అనుమతించబడిందని, ఇప్పుడు మూడు నెలలకు 144 గంటల వరకు చేసుకోవచ్చని పార్థసారథి పేర్కొన్నారు.

గతంలో ఐదు గంటల తర్వాత కనీసం అరగంట విశ్రాంతి ఉండగా.. తాజా సవరణల్లో 6 గంటల తర్వాత కనీసం అర్ధ గంట విశ్రాంతి తీసుకోవచ్చని తెలిపారు. ఎక్కువ మంది మహిళలు రాత్రి షిఫ్టులలో పనిచేయడానికి వీలుగా నైట్ షిఫ్ట్ నిబంధనలను కూడా ఏపీ క్యాబినెట్ సడలించిందని చెప్పుకొచ్చారు. వచ్చే క్యాబినెట్‌ సమావేశం ముందుకు వీటిని తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు. చట్ట సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి సమ్మతి తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+