టెక్నాలజీ అమితంగా పుంజుకుంటున్న ఈ కాలంలో యూజర్లను కొత్త కొత్త ఆవిష్కరణలు కట్టిపడేస్తున్నాయి. వీటిలో చాట్‌జీపీటీ ఒకటి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందరూ ప్రతి చిన్న సందేహాన్ని దీని ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. దాన్ని ఓ స్నేహితుడిలా, భార్యలా, భర్తలా భావించి అన్ని రకాల విషయాలను మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని దాని సృష్టించిన యజమాని చెబుతున్నారు.
చాట్‌జీటీపీ (ChatGPT) సృష్టికర్త, ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఓ కమెడియన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. దీని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఈ చాట్‌బాట్‌తో యూజర్లు పంచుకునే విషయాలు రహస్యంగా ఉండవని తేల్చి చెప్పారు. న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇస్తే తాము ఏ విషయాన్నైనా వెల్లడి చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.ఈ మధ్య చాలామంది తమ జీవితాల్లో జరిగే వ్యక్తిగత విషయాలను చాట్‌జీపీటీతో పంచుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమని తేల్చి చెప్పారు. థెరపిస్ట్‌గా, లైఫ్ కోచ్‌గా భావించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఈ కాలంలో అనేక మంది యువకులు మానసిక ఒత్తిడి, అనిశ్చితి, సంబంధ సమస్యలు, లేదా జీవన మార్గదర్శనం కోసం AI ఆధారిత చాట్‌బాట్‌లను..ముఖ్యంగా ChatGPT ను థెరపిస్ట్ లాగా ఉపయోగిస్తున్నారు. మనకు తోడు చెప్పుకోగల వ్యక్తి లేకపోతే, మన భావోద్వేగాలను ఓ చాట్‌బాట్ ముందు వెల్లగక్కడం ఓ రిలీఫ్‌గా మారుతోంది. ఇదే ప్రమాదకరం కావచ్చని OpenAI CEO సామ్ ఆల్ట్మన్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
ChatGPT ద్వారా జరిపే సంభాషణలు చట్టపరంగా రక్షించబడవని స్పష్టం చేశారు. ఇది నిజమైన థెరపిస్ట్, డాక్టర్ లేదా న్యాయవాదితో జరిపే సంభాషణలా కాదు. ఈ వర్గాల్లో వ్యక్తిగత సమాచారం లీగల్ ప్రొటెక్షన్ కింద వస్తుంది. కానీ, ChatGPTతో మీరు మాట్లాడిన సమాచారానికి అలాంటి చట్టపరమైన గోప్యత గారంటీ ఉండదని ఆల్ట్మన్ హెచ్చరిస్తున్నారు.ఒక్కోసారి న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మేం వ్యవహరించాల్సి ఉంటుందని ఓపెన్‌ఏఐ సీఈఓ వెల్లడించారు.
ప్రస్తుతం చాట్‌జీపీటీ ఫ్రీ, ప్లస్, ప్రొ అకౌంట్లలో డిలీట్ చేసిన చాట్‌లను 30 రోజుల్లోపు సిస్టమ్స్ నుంచి పూర్తిగా అందులో నుంచి తొలగిస్తున్నారు. అయితే అవి శాశ్వతంగా తొలగించడం లేదు. న్యాయపరమైన సమస్యలు ఎదురైతే మాత్రం వాటిని అలాగే ఉంచుతామని ఆల్ట్‌మన్ చెబుతున్నారు. ఏదైనా కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు తమ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని బయటపెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్ల చాట్‌జీపీటీతో వ్యక్తిగత వివరాలు పంచుకునే విషయంలో యూజర్లు పునరాలోచన చేయాలని సూచించారు.
WhatsApp, Signal లాంటి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న అప్లికేషన్లతో పోలిస్తే, ChatGPTలో ఉన్న చాట్‌లను OpenAI సిబ్బంది చదవగలిగే అవకాశం ఉంది. వారు కొన్నిసార్లు AI సామర్థ్యాన్ని మెరుగుపరచడం లేదా దుర్వినియోగాన్ని గుర్తించడం కోసం ఈ చాట్‌లను విశ్లేషించవచ్చు అని తెలిపారు. ఈ నేపథ్యంలో ChatGPTను ఓ మంచి స్నేహితుడిలా భావించినా... మీ సున్నితమైన వ్యక్తిగత విషయాలను షేర్ చేయడంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications